టీమిండియా కెప్టెన్‌, పరుగుల యంత్రం విరాట్ కోహ్లి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 43బంతుల్లో 3పోర్లతో 19 పరుగులు మాత్రమే చేశాడు. ఓ వైపు విఫలమవుతున్నా.. విరాట్‌ ఖాతాలో రికార్డులు వచ్చి చేరుతున్నాయి. గంగూలి, ధోని లకు సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసియా ఖండం అవతల.. కెప్టెన్‌గా 2వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.

దీంతో ఈ మైలురాయిని అందుకున్న మొదటి ఆసియా కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ నిలిచాడు. ఇప్పటి వరకు రెండు వేల పరుగుల మైలురాయిని ఎవ్వరు అందుకోలేదు. విరాట్‌ ఈ ఘనతను 37 టెస్టుల్లో సాధించాడు. విరాట్‌ తరువాత పాకిస్థాన్‌ ఆటగాడు మిస్బా-ఉల్-హక్ ఉన్నాడు. మిస్బా 40 టెస్టుల్లో 1509 పరుగులు సాధించాడు. ఆ తరువాతి స్థానాల్లో ఎంఎస్‌ధోని, అజారుద్దీన్‌ ఉన్నారు. ధోని 48 టెస్టుల్లో 1374, అజారుద్దీన్‌ 36 టెస్టుల్లో 1318 పరుగులు సాధించారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.