సరిలేరు నీకెవ్వరు సినిమాతో టాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన విజయశాంతి..అప్పుడే ఇప్పటికి సెలవు అంటూ ట్వీట్ చేశారు. సరిలేరు నీకెవ్వరు సినిమా తనకు నచ్చిందని, అందుకే అందులో ఆ పాత్ర చేసేందుకు ఒప్పుకున్నట్లు తెలిపారు విజయశాంతి. తనకు సినిమాలకన్నా రాజకీయ ప్రస్థానంలో ఉండటమే ముఖ్యమని పేర్కొంటూ విజయశాంతి ట్వీట్ చేశారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది.

''#సరిలేరు_మీకెవ్వరు ఇంత గొప్ప విజయాన్ని నాకు అందించిన, నన్ను ఎల్లప్పుడూ ఆదరిస్తూ వస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు. నా నట ప్రస్ధానానికి 1979 కళ్ళుకుల్ ఇరమ్,కిలాడి కృష్ణుడు నుండి నేటి 2020 సరిలేరునీకెవ్వరు వరకు ఆగౌరవాన్ని అందించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు.

ప్రజా జీవన పోరాటంలో నా ప్రయాణం... మళ్లీ మరో సినిమా చేసే సమయం, సందర్భం నాకు కల్పిస్తోందో, లేదో నాకు కూడా తెలియదు.. ఇప్పటికి ఇక శెలవు. మనసు నిండిన మీ ఆదరణకు, నా ప్రాణప్రదమైన అభిమాన సైన్యానికి ఎప్పటికీ నమస్సులు. మీ విజయశాంతి. Thank You #సూపర్_స్టార్_కృష్ణగారు #సూపర్_స్టార్_మహేష్_గారు...and #అనిల్_రావిపూడిగారు.'' అని ట్వీట్ చేశారు.రాణి యార్లగడ్డ

Next Story