మెగాస్టార్‌ను చూసి క‌న్నీళ్లు పెట్టుకున్న విజ‌య‌శాంతి..!

By రాణి  Published on  6 Jan 2020 6:27 AM GMT
మెగాస్టార్‌ను చూసి క‌న్నీళ్లు పెట్టుకున్న విజ‌య‌శాంతి..!

''రాజ‌కీయాల్లోకి వెళ్లింది క‌నుక, గ్లామ‌ర్ పోయింది.. వ‌ర్చ‌స్సు, ఫిగ‌రు, పొగ‌రు ఇలా అన్నీ తగ్గాయ‌నుకుంటున్నారా..? 15 ఏళ్ల త‌రువాత చూసినా అదే గ్లామ‌రు, పొగ‌రు, ఫిగ‌రు.. అదే అందం''. ఇంత‌కంటే ఏం కావాలి అంటూ లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతిని ఉద్దేశించి మెగాస్టార్ చిరంజీవి అన్న మాట‌లివి. కాగా, ఆదివారం సాయంత్రం హైదరాబాద్ కేంద్రంగా స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. హీరో మ‌హేష్‌బాబు, ద‌ర్శ‌కుడు అనీల్‌రావిపూడి, నిర్మాత‌లు దిల్‌రాజు, అనీల్ సుంక‌ర‌, హీరోయిన్ రష్మిక‌, త‌మ‌న్నా, చిత్ర బృందం పాల్గొంది.

ఈవెంట్‌లో భాగంగా మైక్ అందుకున్న చిరంజీవి విజ‌య‌శాంతిపై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. సండే అన‌కురా.. మండే అన‌కురా.. ఎప్ప‌టికీ నీ దాన్నురా..? అంటూ తామిద్ద‌రి సినిమాలోని సాంగ్‌ను గుర్తుచేసిన చిరీంజీవి, అలా నాడు నాకు ఇచ్చిన మాట‌ను త‌ప్పి మ‌ళ్లీ 15 ఏళ్ల త‌రువాత క‌నిపించింది. విజ‌య‌శాంతి నా హీరోయిన్‌. టీ.న‌గ‌ర్‌లో ఉంటున్న స‌మ‌యంలో మా ఇద్ద‌రి ఇళ్లు ఎదురెరుగా ఉండేవి. ఎవ‌రింటిలో ఏ చిన్న కార్య‌క్ర‌మం జ‌రిగినా త‌నంటికి నేను.. నా ఇంటికి తాను వ‌స్తూపోతుండేవాళ్లం. ఫ్యామిలీప‌రంగా క‌లిసేవాళ్లం. అంత‌లా విజ‌య‌శాంతితో ఎమోష‌న్స్ ఉన్నాయి అని చిరంజీవి చెప్పారు.

అలా, విజ‌య‌శాంతితో దాదాపు 20 సినిమాలు చేశాన‌ని చెప్పిన చిరంజీవి, ఆ త‌రువాత ప్ర‌జారాజ్యం పార్టీతో పొలిటిక‌ల్ ఎంట్రీ స‌మ‌యంలో త‌నపై విజ‌య‌శాంతి చేసిన కామెంట్స్‌ను గుర్తు చేశారు. అస‌లు అన్ని మాట‌లు అనేందుకు నీకెలా మ‌న‌సొచ్చింది..? అంటూ ప్ర‌శ్నించ‌గా రాజ‌కీయాలు వేరు.. సినిమాలు వేరు. అయినా మ‌న‌మిద్ద‌రం మిత్రులం.. నా హీరో నువ్వు.. నేను మీ హీరోయిన్‌. ఏదేమైనా ఎవ్వ‌రితో చేయ‌న‌న్ని సినిమాలు మీతో చేశాను. అది కాద‌న‌లేరు క‌దా..! అంటూ చిరంజీవి ప్ర‌శ్న‌కు విజ‌య‌శాంతి స‌మాధానంగా చెప్పుకొచ్చింది.

మా ఇద్ద‌రి క‌ల‌యిక‌లో చాలా హిట్స్ సాంగ్స్ వ‌చ్చాయి అంటూ చిరంజీవి, విజ‌య‌శాంతి కాసేపు ప్లాష్‌బ్యాక్‌కు వెళ్లారు. సినిమాల్లోకి మ‌ళ్లీ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. రాజకీయంగా విజ‌య‌శాంతి న‌న్ను కామెంట్ చేసినా త‌న‌ను తిరిగి అన‌బుద్ధి కాలేదు. అందులోను విజ‌య‌శాంతి న‌న్ను చూస్తూ చెమ‌ర్చిన క‌ళ్ల‌తోటి క‌న్నీళ్లు పెట్టుకుంది. అలానే న‌న్ను ఆప్యాయంగా చూస్తూ ఉండిపోయింది. నా గుండెను ట‌చ్‌చేసింది. ఇలా మ‌హేష్‌బాబు పుణ్య‌మా అని ఇన్ని సంవ‌త్స‌రాల త‌రువాత విజ‌య‌శాంతిని మ‌ళ్లీ క‌ల‌వ‌గ‌లిగా. థాంక్యూ మ‌హేష్‌బాబు, థ్యాంక్యూ సోమ‌చ్ అంటూ చిరంజీవి త‌న ప్ర‌సంగాన్ని ముగించారు.

Next Story