ఆ కాయితాలు భద్రంగా దాచుకో చిట్టీ : విజయసాయి

By రాణి  Published on  21 Feb 2020 12:25 PM GMT
ఆ కాయితాలు భద్రంగా దాచుకో చిట్టీ : విజయసాయి

వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి చంద్రబాబుపై ట్విట్టర్ ద్వారా దాడి చేశారు. గురువారం లోకేష్ వివరించిన నారా వారి ఆస్తులపై ఆయన కౌంటర్ వేశారు.

''తండ్రేమో తన ఆస్థి లక్ష కోట్లని వేల మంది సాక్షిగా ప్రకటించాడు. చిట్టినాయుడేమో ఆస్థుల వివరాలంటూ, ఎండాకాలంలో లేచే సుడిగాలిలా అందరి కళ్లలో దుమ్ముకొడతాడు. ఈ ఐదేళ్లలో ఎంత నొక్కేసిందీ త్వరలోనే బయట పడుతుంది. అప్పుటిదాకా ఆ కాయితాలు భద్రంగా దాచుకో చిట్టీ!'' అని సెటైర్లు వేశారు.



అలాగే చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎన్నికల కోసం రూ.400 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. అహ్మద్ పటేల్ కు ఆయన రూ.400 కోట్లిచ్చారని, బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలన్నింటికీ చంద్రబాబు నిధులు సమకూర్చాడని ఆరోపణలు చేశారు.

''అహ్మద్ పటేల్ కు పంపిన 400 కోట్లే కాదు. బిజెపి వ్యతిరేక ప్రాంతీయ పార్టీలన్నిటికీ నిధులు సమకూర్చాడు. తెలంగాణా ఎన్నికల్లో 400 కోట్లు ఖర్చుపెట్టాడు. అప్పట్లో దీనిపై జాతీయ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. 13 జిల్లాల చిన్న రాష్ట్రం సిఎం దేశం మొత్తానికి ఎలక్షన్ ఫండింగ్ చేశాడు.''



''కమీషన్ల కోసం ఎక్కువ ధరకు విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు చేసుకొని ఏపీ ట్రాన్స్ కోకు 70 వేల కోట్లు అప్పులు మిగిల్చి వెళ్లాడు బాబు. ఈ పిపిఏల దళారి ఎవరంటే కిరసనాయిలు. అక్రమ సంపాదన ఆగిపోయిందనే సిఎం జగన్ గారిని పిపిఏల రద్దుపై ప్రధాని మోదీ నిలదీశారని బోగస్ వార్త రాశాడు.'' అని విజయసాయి రెడ్డి విమర్శించారు.

Next Story