తమిళ స్టార్‌ హీరో విజయ్‌కు ఐటీ అధికారుల షాక్‌

By Newsmeter.Network  Published on  5 Feb 2020 1:02 PM GMT
తమిళ స్టార్‌ హీరో విజయ్‌కు ఐటీ అధికారుల షాక్‌

తమిళ హీరో విజయ్‌ కు ఐటీ అధికారులు షాకిచ్చారు. షూటింగ్ కు వెళ్లి మరీ విజయ్‌ ను ప్రశ్నించారు ఆదాయపన్ను శాఖ అధికారులు. ఏజీఎస్ సినిమాస్‌ సంస్థ పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. ఏజీఎస్ ఎంటర్ టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఏజీఎస్ సినిమా, డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్‌లపై ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.

విజయ్‌ హీరోగా రూపొందిన 'బిగిల్' సినిమాను గత ఏడాది ఏజీఎస్‌ సినిమాస్‌ నిర్మించింది. ఈ సినిమాకు సంబంధించి విజయ్ ఎంత పారితోషికం తీసుకున్నారు.. ఏ రూపంలో తీసుకున్నారు.. వాటిని ఎలా ఖర్చుచేశారూ వంటి లావాదేవీలపై విజయ్‌ ను అధికారులు ప్రశ్నించారు. ప్రస్తుతం విజయ్‌.. 'మాస్టర్' సినిమా షూటింగ్‌లో ఉన్నారు. షూటింగ్‌ స్పాట్‌ లోనే హీరో విజయ్‌ని ఐదు గంటల పాటు ప్రశ్నించారు. దీంతో షూటింగ్‌ నిలిచిపోయింది. కాగా కొద్ది రోజుల క్రితం హీరోయిన్‌ రష్మిక మందాన ఇంటిపై కూడా ఐటీ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే.

Next Story