వచ్చే వారం..  రాజమండ్రిలో 'వెంకీ' యాక్షన్  !  

By Newsmeter.Network  Published on  16 Jan 2020 12:50 PM GMT
వచ్చే వారం..  రాజమండ్రిలో వెంకీ యాక్షన్  !  

'ఎఫ్ 2', 'వెంకీమామ' సినిమాలతో సూపర్ హిట్ కొట్టిన విక్టరీ వెంకటేష్ తన తరువాత సినిమాల్ని కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. కాగా తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ చిత్రాన్ని వెంకటేష్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేయనున్నారు. ధనుష్, మంజు వారియర్ జంటగా తెరకెక్కిన ఈ అసురన్ మూవీని తెలుగులో కొన్ని మార్పులు చేసి తీసుకురాబోతున్నారు. ముఖ్యంగా వెంకటేష్ టైమింగ్ కి తగ్గట్లు కొన్ని కొత్త సీన్స్ ను రాయించారు. నిజానికి సినిమాలో వెంకటేష్ క్యారెక్టర్ చాల సీరియస్ గా సాగుతోంది. అయితే ఆ సీరియస్ నెస్ లో కూడా వెంకటేష్ చేసే యాక్టివిటీస్ తో ఫన్ జనరేట్ అయ్యేలా స్క్రిప్ట్ లో కామెడీ ట్రాక్స్ ను రాశారు. వచ్చే వారం నుండి రాజమండ్రిలో ఈ సీన్స్ నే తీయనున్నారు.

ఇక వెట్రిమారన్ తెరకెక్కించిన ఈ ఫ్యూర్ యాక్షన్ డ్రామా తమిళనాట సంచలన విజయంతో భారీ కలెక్షన్స్ ను కూడా సాధించింది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ రీమేక్ లో నటించే నటీనటులు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక వెంకటేష్, నాగ చైతన్యతో కలిసి నటించిన మల్టీస్టారర్ 'వెంకీ మామ', వెంకటేష్ కి మంచి విజయాన్ని అందించింది.

Next Story
Share it