రాజధాని ఒకే చోట ఉంటేనే.. పాలనా సౌలభ్యం

By Newsmeter.Network  Published on  25 Dec 2019 10:57 AM GMT
రాజధాని ఒకే చోట ఉంటేనే.. పాలనా సౌలభ్యం

మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వడం విషయం లో నాది మొదటి నుంచి ఒకటే అభిప్రాయం అని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. స్వర్ణ భారతి ట్రస్ట్ లో మీడియా తో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాధమిక విద్య తెలుగులో ఉండాలని.. మాతృ బాష ప్రాధాన్యం గురించి ప్రధాని కూడా చాల సార్లు ప్రస్థావించారన్నారు. మాతృ భాష లో ప్రాథమిక విద్య వలన పిల్లలకు అనుకూలంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రం కొత్తగా ఏర్పడిన సమయంలో కేంద్ర సంస్థలను అన్ని ప్రాంతాల్లో ఉండాలనే ఉద్దేశంతో తను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా చొరవ తీసుకొని జిల్లాకోక కేంద్ర సంస్థను ఏర్పాటు చేసేలా కృషి చేశానని గుర్తు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఈ విధంగా జరగాలని తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణకు నేను మొదటి నుంచి కట్టుబడి ఉన్నాను అన్న విషయాన్ని గుర్తుచేశారు.

రాష్ట్రంలో పరిపాలన సవ్యంగా జరగాలంటే పరిపాలనకు అవసరమైన అదికార కార్యాలయాలు అన్ని కూడా ఒకే ప్రాంతంలో ఉంటే మంచిగా ఉంటుంది అన్నారు. పాలనా యంత్రంగం ఒక చోట హైకోర్ట్ వేరొక చోట అసెంబ్లీ మరొక చోట ఉండడం వలన వాటి మధ్య సమన్వయం సరిగా ఉండదని. సమయం కూడా వృధా అవుతుందని అదేవిధంగా పరిపాలనా జాప్యం జరిగే అవకాశం ఉంటుందన్నారు. నాకున్న 42 ఏళ్ళ రాజకీయ అనుభవం తో చెపుతున్నమాట ఏంటంటే అన్ని కూడా ఒకే చోట ఉంటేనే పాలనలో సౌలభ్యం ఉంటుందని అన్నారు. వ్యక్తిగత అభిప్రాయాన్ని వివాదం కోసమో లేదా రాజకీయం కోణం లో చూడవద్దని అన్నారు. . కేంద్రం నన్ను ఈ విషయంలో నా అభిప్రాయం అడిగితే నేను ఇదే చెబుతాను అన్నారు.

Next Story