ప్రముఖ సీనియర్‌ నటి రేఖ లోకనాయకుడు కమల్‌ హాసన్‌ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విషయాలు షాకింగ్‌కు గురిచేసేలా ఉన్నాయి. 1986లో ‘పున్నగాయ్ మన్నన్’ సినిమాలో రేఖ, కమల్ హాసన్ కలిసి నటించారు. అందులో కమల్, రేఖ గాఢంగా ప్రేమించుకుంటారు. ఇంట్లోవాళ్లు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో చనిపోవాలని నిర్ణయించుకుంటారు. ఆత్మహత్య చేసుకునే సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నప్పుడు కమల్.. రేఖ‌కు ముద్దుపెట్టేశాడట.

Veteran Actor Rekha Shocking Comments

ఆ ఇంటర్వ్యూలో ఏంచెప్పిందంటే.. కే. బాలచందర్ దర్శకత్వంలో పున్నగాయ్ మన్నన్ సినిమాలో.. మేం సూసైడ్ సీన్ షూటింగ్ చేస్తుంటే.. ఒక్కసారిగా కమల్ హాసన్ ముద్దు పెట్టేసాడు. ముద్దు సీన్ ఉందని నాకు దర్శకుడు బాలచందర్ కానీ హీరో కమల్ హాసన్ కానీ ఎవ్వరు చెప్పలేదు. ఆయన కావాలని చేసింది కాదు కానీ.. నా అనుమతి లేకుండా కమల్ ముద్దు పెట్టేయడంతో కోపం వచ్చింది. షూటింగ్ అయిపోయాక నేను బాలచందర్ వద్దకు వెళ్లి ఈ విషయం గురించి అడగగా.. ఈ ముద్దు సీన్‌లో తప్పేముంది? ఇద్దరి మధ్య ప్రేమ ఉందని చూపించాలంటే ముద్దు సీన్లు ఉండాల్సిందేనని చెప్పారు. కానీ ఆ సీన్‌.. తర్వాత నాకు కొన్ని రోజులు నిద్ర పట్టలేదు. అదో పీడకలలా వెంటాడిందని చెప్పారు.

Next Story