క‌లియుగ పాండ‌వులు సినిమాతో కెరీర్ ప్రారంభించి, తొలి చిత్రంతోనే విజ‌యం సాధించి.. వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ ప్రేక్ష‌క హృద‌యాల్లో సుస్ధిర స్ధానం సంపాదించుకున్నారు సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్.

ప్రేమ‌, బొబ్బిలి రాజా, క్ష‌ణ‌క్ష‌ణం, చంటి, సుంద‌ర‌కాండ‌, ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా, కలిసుందాం రా, రాజా, పవిత్రబంధం, సూర్యవంశం, లక్ష్మి, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే... ఇలా వైవిధ్య‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుని విజ‌యాలు సాధించారు.

ఇటీవ‌ల కాలంలో త‌న వ‌య‌సుకు త‌గ్గ‌ట్టుగా పాత్ర‌లు ఎంచుకుంటున్నారు. గురు సినిమాతో విజ‌యం సాధించి ఎంత‌గానో ఆక‌ట్టుకున్నారు. ఆ త‌ర్వాత మెగా హీరో వ‌రుణ్ తేజ్ తో ''ఎఫ్ 2'' సినిమాలో న‌టించి ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించారు. తాజాగా మేన‌ల్లుడు నాగ చైత‌న్య‌తో ''వెంకీమామ'' అనే సినిమా చేశారు. ఈ సినిమా ఈ రోజు (డిసెంబ‌ర్ 13) వెంక‌టేష్ పుట్టిన‌రోజు నాడే థియేటర్లలో రిలీజ్ అయి సందడి చేస్తోంది.

సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్ధ‌లు సంయుక్తంగా నిర్మించిన‌ ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ ని ''జై ల‌వ‌కుశ'' ఫేమ్ బాబీ తెర‌కెక్కించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈరోజు రిలీజైన ''వెంకీమామ'' హిట్ టాక్ సొంతం చేసుకుంది. నెక్ట్స్ అసుర‌న్ రీమేక్ లో వెంకీ న‌టించ‌నున్నారు. శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కించే ఈ సినిమాని జ‌న‌వ‌రిలో ప్రారంభించి.. స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇలా వైవిధ్య‌మైన చిత్రాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటూ.. విక్ట‌రీని ఇంటి పేరుగా మార్చుకున్న వెంకీమామ‌కు హ్యాపీ బ‌ర్త్ డే..!

రాణి యార్లగడ్డ

Next Story