సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీల్లో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఒకరు. శనివారం మధ్యాహ్నం ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఒక ఫోటో దేశభక్తిని ప్రేరేపిస్తోంది. అలాగే ఆ తండ్రికి తన కొడుకుపై ఉన్న ప్రేమకు అర్థం చెప్పేలా ఉంది ఆ ఫొటో. సెహ్వాగ్ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన ఫొటోలను, వీడియోలను షేర్ చేయటమే కాకుండా అప్పుడప్పుడు దిమ్మతిరిగే పంచ్ లు కూడా ఇస్తుంటారు. ట్వీట్ల ద్వారా నవ్వులు పూయించడంలో సెహ్వాగ్ కు ఎవరూ సాటిలేరనే చెప్పాలి.

తాజాగా సెహ్వాగ్ చేసిన ట్వీట్ పై నెటిజన్లు కూడా పెద్దఎత్తున స్పందిస్తున్నారు. న్యూఢిల్లీలో ఉన్న నేషనల్ వార్ మెమోరియల్ ఫొటోను ఆయన అప్‌లోడ్ చేశారు. ఓ అమర జవాన్ తండ్రి తన కుమారుడి పేరును ముద్దాడుతూ..ఉద్వేగానికి గురవుతున్న సందర్భమది. ఈ ఫోటో పోస్ట్ చేసిన సెహ్వాగ్ ”మాటలు రావడం లేదు. ప్రేమ, గౌరవాలు తప్ప. గర్వంతో పాటు మరెంతో.. నేషనల్ వార్ మెమోరియల్ దగ్గర తనయుడి పేరును ముద్దాడుతూ ఓ అమర జవాన్ తండ్రి” అని రాశారు. దీనిపై స్పందించిన నెటిజన్లు జవాన్లకు నివాళులు అర్పిస్తున్నారు. దేశం కోసం అమరజవాన్లు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ అమరుల ఫొటోలను ట్వీట్ చేస్తున్నారు.

 

 

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.