పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌పై ఉత్తమ్‌కుమార్‌ ఫైర్‌..

By సుభాష్
Published on : 28 Dec 2019 4:07 PM IST

పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌పై ఉత్తమ్‌కుమార్‌ ఫైర్‌..

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌పై టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తిరంగ ర్యాలీకి పోలీసుల అనుమతి నిరాకరణపై ఆయన మండిపడ్డారు. సీపీ అంజనీకుమార్ పోలీసు కాదు.. సీఎం కేసీఆర్‌కు ఏజెంటుగా పని చేస్తున్నారని ఆరోపించారు. నిక్కచ్చిగా విధులు నిర్వహించాల్సిన పోలీసు ఉన్నతాధికారులే ఇలా కేసీఆర్‌కు ఏజెంటుగా పని చేస్తున్నారని దుయ్యబట్టారు. అంజనీకుమార్‌ క్యారెక్టర్‌ లేని వ్యక్తి అని, అవినీతిలో కూరుపోయారని ఆరోపణలు గుప్పించారు. సీసీగా ఉండే అర్హత ఆయనకు లేదని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సోమవారం గవర్నర్‌ను కలిసి అంజనీకుమార్‌పై ఫిర్యాదు చేయనున్నట్లు ఉత్తమ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఉత్తమ్‌ డీజీపీ మహేందర్‌రెడ్డికి ఫోన్‌ చేశారు. గాంధీ భవన్‌లో దీక్ష చేసుకుంటే తమను అరెస్ట్‌ చేస్తారా..? అని ప్రశ్నించారు. పార్టీ కార్యాలయానికి వచ్చిన కార్యకర్తలను అడ్డుకోవడానికి మీరెవరంటూ మండిపడ్డారు. కార్యకర్తలను అరెస్ట్‌ చేయవద్దని సీపీకి చెప్పండని కోరారు.

Next Story