ప్రపంచం మొత్తానికి ముచ్చెమటలు పుట్టిస్తోన్న కరోనా వైరస్..ఇండియాలోకి వ్యాప్తి చెందిన నేపథ్యంలో ప్రజలంతా మాస్క్ ల కోసం మెడికల్ షాపులకు క్యూ కడుతున్నారు. కొన్ని షాపుల్లో అయితే మాస్క్ లు స్టాక్ ఉండట్లేదు. కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు చాలా మంది ఎన్ 95 మాస్క్ లను వాడేందుకే మొగ్గు చూపుతున్నారు. మార్కెట్ లో మాస్క్ ల కొరత ఉండటంతో కొణిదెల వారి కోడలు ఉపాసన సోషల్ మీడియాలో ఇన్ స్టెంట్ మాస్క్ లను ఎలా తయారు చేయాలో చూపిస్తూ..ఒక వీడియో పోస్ట్ చేశారు.

కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టిన మోడెర్నా బయోటెక్ సంస్థ..కానీ

”హాయ్ గాయ్స్..కరోనా పై ఉన్న భయాన్ని వదిలేయండి. బాధ్యత ఉన్న పౌరుడిగా వ్యవహరించండి. చాలా మంది మెడికల్ షాపుల్లో మాస్క్ లు, శానిటైజర్స్ సరిగ్గా దొరకడం లేదంటున్నారు. దేశంలో ఎన్ 95 మాస్క్ ల కొరత ఉండటంతో వాటిని అందించేందుకు వివిధ కంపెనీలు చాలా కష్టపడుతున్నాయి. ఖచ్చితంగా మాస్క్ లను ధరించాలని భావించేవారు మీ ఇంటి వద్దే మాస్క్ ను తయారు చేసుకోవచ్చు. టిష్యూతో మాస్క్ తయారు చేయడం ఇటీవలే నేను కూడా నెట్ లో చూశాను. ఈ వీడియో చూసి మాస్క్ ను తయారు చేసుకోండి. కానీ..ఒకసారి వాడిన మాస్క్ ను బయటపడేయకుండా చెత్తబుట్టలో మాత్రమే వేయండి. ఈ మాస్క్ ను మీ చుట్టూ ఉన్నవారిలో కరోనా లక్షణాలుంటేనే ధరించండి. అనవసరమైన అపోహలతో మాస్క్ లను ధరించాల్సిన అవసరం లేదు.” అని ఉపాసన కొణిదెల తెలిపారు.

కరోనా టెర్రర్..హోల్ సేల్, రిటైల్ మార్కెట్లకు పండుగే..

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.