స్టూడెంట్ వీసాపై యూఎస్ వెళ్లిన సచిన్ చేసిన పనికి..

By రాణి  Published on  6 March 2020 10:42 AM GMT
స్టూడెంట్ వీసాపై యూఎస్ వెళ్లిన సచిన్ చేసిన పనికి..

ఇండియాకు చెందిన సచిన్ అజి భాస్కర్ (23) అనే యువకుడు స్టూడెంట్ వీసాపై యూఎస్ వెళ్లాడు. అక్కడ మైనర్ బాలికపట్ల అతడు లైంగిక ప్రలోభానికి పాల్పడటంతో..అక్కడి జిల్లా న్యాయస్థానం సచిన్ ను దోషిగా తేల్చింది. సచిన్ ఈ నీచానికి పాల్పడినందుకు అతడికి జీవిత ఖైదు పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మైనర్‌ను లైంగిక ప్రలోభానికి గురి చేసినట్లు యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి విలియం ఎం స్ర్కెట్నీ ముందు సచిన్ అంగీకరించడంతో పదేళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.కోటి 85 లక్షల వరకు జరిమానా విధించే అవకాశమున్నట్లు యూఎస్ అటార్నీ జేమ్స్ పీ కెన్నెడీ తెలిపారు.

2018, ఆగస్టు నెలలో సచిన్ 11 ఏళ్ల మైనర్ కు ఫోన్ ద్వారా టెక్స్ట్ మెసేజ్ లు, ఈమెయిల్స్ పంపించి..తనతో శృంగారంలో పాల్గొనవలసిందిగా ప్రలోభపెట్టినట్లు లాయర్లు పేర్కొన్నారు. తాజాగా..ఈ విచారణలో సచిన్ తాను చేసిన నేరాన్ని అంగీకరించడంతో జూన్ 17న అక్కడి కోర్టు శిక్ష ఖరారు చేయనుంది.

https://telugu.newsmeter.in/corona-attacked-facebook-employee/

Next Story