తెలంగాణలో కరోనా కేసులు 1,45,163

By సుభాష్  Published on  8 Sep 2020 4:21 AM GMT
తెలంగాణలో కరోనా కేసులు 1,45,163

తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2392 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 11 మంది మృతి చెందారు. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,45,163 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 906 మంది కరోనాతో మరణించారు. ఇక రాష్ట్రంలో మరణాల రేటు 0.62శాతం ఉంటే, దేశంలో1.69 శాతం ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొంది. కోలుకున్న వారి రేటు రాష్ట్రంలో 77.5 శాతం ఉంటే, దేశంలో 77.54 శాతం ఉంది. మొత్తం యాక్టివ్‌ కేసులు 31,670 ఉండగా, హోమ్‌ ఐసోలేషన్‌లో 24,579 ఉన్నట్లు తెలిపింది.

అలాగే కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీలో 304, రంగారెడ్డి 191, సూర్యాపేట 101, నిజామాబాద్‌ 102, నల్గొండ 105, మేడ్చల్‌ మల్కాజిగిరి 132, ఖమ్మం 116, కరీంనగర్‌ 157 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇతర జిల్లాల్లో వంద లోపు కేసులు నమోదయ్యాయి.

Next Story