ప్రభుత్వ ఉద్యోగులకు మార్గదర్శకాలను విడుదల చేసిన తెలంగాణ సర్కార్‌

By సుభాష్  Published on  20 Jun 2020 11:19 AM GMT
ప్రభుత్వ ఉద్యోగులకు మార్గదర్శకాలను విడుదల చేసిన తెలంగాణ సర్కార్‌

తెలంగాణలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. అయితే లాక్‌డౌస్‌ సడలింపుల కారణంగా రాష్ట్రంలో కరోనా కేసుల ఒక్కసారిగా పెరిగిపోయాయి. ప్రతిరోజు 200 నుంచి 300 వరకు కేసులు నమోదవుతున్నాయి. ఇక హైదరాబాద్‌లో కరోనా కేసులు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. ఇక లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా అన్ని కార్యాలయాలు తెరుచుకున్నాయి. ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అనేక కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పుడు కార్యాలయాలకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. అందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు మార్గదర్శకాలను విడుదల చేసింది.

మార్గదర్శకాల ప్రకారం.. ప్రభుత్వ కార్యాలయాలు ఇక నుంచి 50 శాతం ఉద్యోగులతోనే పని చేయాలి. కార్యాలయాల్లో పని చేసే కింది స్థాయి ఉద్యోగులు 50 శాతం ఒక వారం.. మిగతా 50 శాతం ఉద్యోగులు మరో వారం పని చేయాల్సి ఉంటుంది. ఇక అధికారుల డ్రైవర్లు పార్కింగ్‌ లో కాకుండా పేషీలో ఉండాలి. లిప్ట్‌ లో వెళ్లే వారు ముగ్గురి కంటే ఎక్కువ ఉండకూడదు. కార్యాలయాల్లో ఏసీలు వాడకుండా ఉంటే మంచిదని సూచించింది. ఇక విధుల్లో లేని ఉద్యోగులు హెడ్‌క్వార్టర్‌ను వదిలి బయటకు వెళ్లకూడదు. అనారోగ్య సమస్యలున్న ఉద్యోగులు సెలవులను వినియోగించుకోవాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది.

Next Story