తెలంగాణలో 2,23,413 పాజిటివ్‌ కేసులు

By సుభాష్  Published on  3 Nov 2020 3:17 AM GMT
తెలంగాణలో 2,23,413 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,536 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతి చెందారు. ఇప్పటి వరకు మొత్తం రాష్ట్రంలో 2,42,506 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 1351 మంది మృత్యువాత పడ్డారు. ఇక తాజాగా కరోనా నుంచి 1,421 మంది కోలుకోగా, ఇప్పటి వరకు మొత్తం 2,23,413 మంది కోలుకున్నారు. మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 17,742 ఉండగా, హోం ఐసోలేషన్‌లో 14,915 మంది చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

రాష్ట్రంలో మరణాల రేటు 0.55 శాతం ఉండగా, అదే దేశంలో అయితే 1.5 శాతం ఉన్నట్లు తెలిపింది. అలాగే రాష్ట్రంలో కోలుకున్నవారి రేటు 92.12 శాతం ఉండగా, అదే దేశంలో 91.7శాతం ఉంది. ఇక అత్యధికంగా 24 గంటల్లో జీహెచ్‌ఎంసీలో 281, కొత్తగూడెం 123 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మిగతా జిల్లాల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Next Story