తెలంగాణలో కొత్తగా 1554 కరోనా కేసులు.. మరణాలు ఎన్ని అంటే..

తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1554 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

తాజాగా 9 మంది మృతి చెందారు. అలాగే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 49, 259 నమోదు కాగా, ఇప్పటి వరకు మొత్తం 438 మంది మృతి చెందారు. అలాగే ఈరోజు 1281 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక 11,155 మంది యాక్టివ్‌గా ఉన్నారు. అత్యధికంగా కేసులు హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో 842 కాగా, రంగారెడ్డి జిల్లాలో 132 ఉన్నాయి.సుభాష్

.

Next Story