తెలంగాణలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకు కరోనా కేసులసంఖ్య పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో 1,213 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. విడుదలైన హెల్త్ బులిటెన్ ప్రకారం..  తాజాగా 8 మంది మృతి చెందగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 275 మంది మృతి చెందారు. అయితే 987 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక గురువారం హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో 998 కేసులు నమోదు కాగా,  మేడ్చల్‌లో 54, రంగారెడ్డిలో 48, ఖమ్మంలో 18, వరంగల్‌ రూరల్‌లో 10, వరంగల్‌ అర్బన్‌లో 9, నల్గొండలో, భద్రాద్రిలో 7, సిరిసిల్లలో 6, కరీంనగర్‌లో 5, నిజామాబాద్‌లో 5, ములుగు, నిర్మల్‌లో 4 చొప్పున, నారాయణపేట, కామారెడ్డిలో 2 చొప్పున, గద్వాల్, సిద్దిపేట, మెదక్, యాదాద్రి, నాగర్‌కర్నూల్, వికారాబాద్‌లో ఒక్కో కేసు నమోదయ్యాయి.

ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 18,570కి చేరగా, ఇందులో ఇప్పటి వరకు డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 9,069 ఉంది. అలాగే రాష్ట్రంలో ఇప్పటి వరకు 98,153 మంది కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.