మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో స్టెలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, పూజా హెగ్డే నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలో బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. కాగా, ఈ మూవీ విషయంలో త్రివిక్రమ్‌కు చిక్కులు వచ్చి పడ్డాయి. కారణమేమిటంటే వేరే డైరెక్టర్‌ చెప్పిన కథను తీసుకుని త్రివిక్రమ్‌ అల వైకుంఠపురములో సినిమాను తెరకెక్కించడమే అని సిని వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది.

చిన్న సినిమాలకు రచయితగా పని చేస్తున్న కృష్ణ అనే దర్శకుడు 2005లో త్రివిక్రమ్‌ని కలిసి సేమ్‌ కథ చెప్పాడట. 2013లో ఈ కథని ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్‌ కూడా చేసుకున్నాడట. తన స్క్రిప్ట్ మొదటి పేజీ కాపీని త్రివిక్రమ్‌కు ఇచ్చినట్లు కృష్ణ ఆరోపిస్తున్నారు. నేను చెప్పిన కథని ‘దశ-దిశ’ అనే టైటిల్‌తో తెరకెక్కించాలనుకున్నాను.. కాని త్రివిక్రమ్‌ నా కథతో ‘అల వైకుంఠపురములో’ సినిమాను తెరకెక్కించాడు అని కృష్ణ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు త్రివిక్రమ్‌కు లీగర్‌ నోటీసులు పంపిస్తానని  కృష్ణ చెబుతున్నాడు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.