వికారాబాద్: జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. బంట్వారం మండలం, సుల్తాన్ పూర్ గ్రామం సమీపంలో శిక్షణ విమానం కూలింది. విమానం ఓ రైతు పంట పొలంలో కుప్పకూలడంతో ఇద్దరు  ట్రైనీ పైలట్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో మహిళాపైలట్ ఉన్నట్లు  సమాచారం. ఇద్దరు పైలట్లు స్పాట్ లోనే చనిపోయారు. ఆకాశం మేఘావృతమై ఉండటం వలన విమానం అదుపుతప్పినట్లు  ప్రాధమిక నిర్ధారణకు అధికారులు వచ్చారు. అయితే..జనవాసాల్లో కూలకపోవడంతో ప్రాణనష్టాన్ని నిలువరించినట్లైంది.

వాతావరణం మేఘావృతమై ఉంది. ఉదయం నుంచి మబ్బులు కమ్ముకున్నాయి. ఇటువంటి వాతావరణంలో  పైలట్లకు అనుమతివ్వడం అనేది కరక్ట్ కాదు. ఆ మాత్రం కూడా అంచనా లేకుండా విమానం నడపడానికి అనుమతి ఇవ్వడం పెద్ద తప్పు.

హైదరాబాద్ చుట్టుపక్కల ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం ఓ శిక్షణ విమానం ఇంటిలోకి చొచ్చుకుపోయింది. హైదరాబాద్‌ చుట్టుపక్కల విమానాలు కూలుతూనే ఉంటాయి. అయినా..అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదు. పైలట్ విమానాల్లో సాంకేతిక జొప్పించడంతోపాటు మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న  విమానాలు ప్రమాదానికి గురవుతుంటాయి.ఇప్పటికైనా అధికారులు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.