20 తర్వాత తెలంగాణలో లాక్‌డౌన్‌కు సడలింపు ఉంటుందా..?
By సుభాష్ Published on 19 April 2020 3:24 AM GMT
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు అత్యవసర కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. కరోనాను కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేసీఆర్ మంత్రులతో సమీక్షించనున్నారు.
అయితే .. ఈనెల 20వ తేదీ తర్వాత లాక్‌డౌన్ నుంచి ఏమైనా సడలింపులు ఇవ్వాలా.. వద్దా.. అనే దానిపై సమావేశంలో చర్చించనున్నారు. ప్రధాని మోదీ 20 నుంచి కొన్ని సడలింపులు ఉంటాయని తెలుపడంతో తెలంగాణ కేబినెట్ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ సడలింపులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాగా, వైద్యులపై జరుగుతున్న దాడులపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఇక కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 750 దాటిపోయింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 18 మంది మృతి చెందగా, 561 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.