టీవీ అందగత్తెల్లో శ్రీముఖే టాప్.. మరి అనసూయ పరిస్థితేంటి..?
By రాణి Published on 31 Jan 2020 7:44 AM GMT“అందమైన భామలు... లేత మెరుపు తీగలు.... ముట్టకుంటే మాసిపోయే కన్నెల అందాలు” అని వాళ్ళ గురించి కుర్రాళ్లు పాటలు పాడుకుంటూ మేఘాల్లో తేలిపోతూంటారు. వారి కళ్లల్లో, కళ్లు మూస్తూ కలల్లో, కళ్లు తెరిస్తే టీవీలో ఈ విరబూసిన అందాలు, ఆరబోసిన ఆనందాలే కనిపిస్తాయి. టీవీల్లో చక్కిలిగింతలు, కలల్లోగిలిగింతలు పెట్టే తెలుగు టీవీ భామల్లో మగాళ్లు కోరుకునే మోస్ట్ డిజైరబుల్ అందగత్తెల జాబితాను టైమ్స్ ఆఫ్ ఇండియా తయారు చేసింది. పాఠకుల పోల్స్, ఎక్స్ పర్ట్లుల ఒపీనియన్స్, ఫాషనిస్టాల జడ్జ్ మెంట్ల ఆధారంగా ఈ జాబితా తయారు చేశారు.
అందులో టాప్ టెన్ ఇదుగో మీకోసం..
1) శ్రీముఖి - క్యూట్, బబ్లీ, ఫన్.... ఈ పదాలు ఆమెపేరు వినగానే చటుక్కున గుర్తుకొస్తాయి. టైటిల్ గెలుచుకోకున్నా హృదయాలను గెలుచుకున్న మన పాపులర్ యాంకర్ శ్రీముఖే మోస్ట్ డిజైరబుల్ నంబర్ వన్. పటాస్ లో రాములమ్మగా, పేరొందిన శ్రీముఖి కొందరికి అక్క, కానీ చాలా మందికి సింపుల్ గా డార్లింగ్. ఇరవై అయిదు లక్షల ఇన్ స్టా ఫాలోయర్లతో ఆమె సోషల్ మీడియా రారాజ్ఞిగా వెలుగొందుతోంది. ఇటీవలే అనవసరమైన బరువును తగ్గించి , అందరినీ స్టన్ చేసేస్తోంది శ్రీముఖి. బిగ్ బాస్ రన్నరప్ గా వచ్చిన పేరును, పాపులారిటీని పూర్తిగా ఉపయోగించేసుకుందామని అమ్మడు డిసైడైపోయింది.
2) వింధ్యా విశాఖ - ఏదో ఘటకేసర్ కి చెందిన పల్లెటూరు పిల్ల అనుకోకండి. వింధ్య ఒక ఆటం బాంబు. ప్రో కబడ్డీ నుంచి క్రికెట్ లీగ్ దాకా స్పోర్ట్స్ కామెంటరీలో మనమ్మాయి ఒక ట్రయల్ బ్లేజర్. ఆకర్షణీయమైన దుస్తులు, అందమైన చిరునవ్వు,పక్కింటి పిల్లలాంటి ఫేసు, ప్రతియువకుడూ కోరుకునే బాడీ ఆమె సొంతం. మాములుగా “బంతివేశాడు... బ్యాట్ తో కొట్టాడు” అనే డల్ క్రికెట్ కి రంగుల హంగులద్దే వింధ్య లేకపోతే ఇప్పుడు ఆట చూడబుద్ధి కావడం లేదంటే నమ్మండి. స్టాటస్ - అవివాహిత.
3) సమీరా షరీఫ్ - 2006 లో ఆడపిల్ల సీరియల్ తో అరంగేట్రం చేసినప్పట్నుంచీ ఈ అమ్మడు బ్రేకుల్లేకుండా దూసుకెళ్తూనే ఉంది. అభిషేకం, మంగమ్మగారి మనవరాలు వంటి సీరియళ్ల తరువాత ఇప్పుడు తమిళ తంబిలను కూడా ఆకట్టుకుంటోంది. అదిరిందిలో హోస్ట్ గా ఉన్న ఈ అమ్మడు మీ అమ్మగారు కోడలుగా ఓకే అనేసేంత హోమ్లీగానూ, కళ్లు తిప్పుకోలేనంత హాటీగానూ ఒకే సమయంలో ఉండగలుగుతుంది. స్టేటస్ - వివాహం అయిపోయింది.
2017 టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ వర్షిణి
4) వర్షిణి సౌందరరాజన్ - 2017 టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ జాబితాలోకి చేరిన వర్షిణి..టీవీలు, సినిమాల్లో నటించింది. యాంకర్ గా ఆకట్టుకుంది. ఆధునికం, ట్రెడిషనల్ ఇలా లుక్ ఏదైనా సరే..అద్భుతంగా క్యారీ ఆఫ్ చేసేయగలదు. కావాలంటే క్రాప్ టాప్ వేయగలదు, వడ్డాణం, వంకీలతో అలరించగలదు. స్టేటస్ - సింగిల్.
5) రష్మీ గౌతమ్ - అందాల రష్మీ తెలుగు తెర ఒరిజినల్ సెక్స్ బాంబ్. ఆమెను పరిచయం చేయాల్సిన అవసరం అసలుందా? ఆమె పేరు చెప్పగానే అటు గుంటూరు టాకీస్, ఇటు జబర్దస్త్ గుర్తుకొస్తాయి. ఇప్పుడామె ఢీ చాంపియన్స్ తో దూసుకెళ్లోతంది. ఆమె తన సెక్సప్పీల్ ను పూర్తిగా వాడేసుకుంటోంది. ఆమె నవ్వు వంద బల్బులు వెలిగిస్తే ,ఆమె లుక్స్ వెయ్యి బెడ్ రూమ్ బల్బులు ఆర్పేస్తాయి. ఒక్క మాటలో చెప్పాటంటే రష్మీ నడిచొచ్చే హాట్ ప్యాక్. స్టేటస్ - సింగిల్.
6) విష్ణు ప్రియ భీమినేని - ఆమె లుక్స్ చాలా ప్రత్యేకం. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ఇంకా ప్రత్యేకం. పోవే పోరా డాన్స్ షో తో ఆమె గుండెల్లో గిలిగింతలు పెడుతోంది. ఆ షో కి ఆమె హొయలే అసలు ఆకర్షణ. ఆమె లుక్స్, ఆమె ఐస్, అమ్మో అనిపించే అమ్మానియా అంత అందాలు ఆమెను ఆరో స్థానానికి తెచ్చాయి. స్టేటస్ - సింగిల్.
7) దీప్తి మన్నె - ప్రపంచమంతా తిరిగేయాలన్న తృష్ణతో బయలుదేరిన దీప్తి ఇప్పుడు పద్మావతి, రాధమ్మ కూతురు వంటి సీరియళ్లతో ఇంటింటిలో ఫేమస్ అయిపోయింది. ఆమె మత్తు కళ్లు, ఆమె హాట్ నవ్వు ఆమెను మోస్ట్ డిజైరబుల్ నం. 7 చేశాయి. స్టాటస్ - సింగిల్.
8) భూమి శెట్టి - నిన్నే పెళ్లాడతాలో మృదులగా మృదువుగా ఉండే భూమిది ఎనిమిదో స్థానం. ఆమె సీరియల్ లో అష్టకష్టాలు అనుభవించే అమాయకపు కన్యగా కనిపించినా రియల్ లైఫ్ లో కత్తి లాంటిదే. ఆమె సీరియల్ ను వదిలేసి కన్నడ బిగ్ బాస్ లోకి హౌస్ మేట్గా వెళ్తే కొన్ని వందల గుండెలు కలుక్కుమన్నాయట. ఆమె అందం చూస్తే ఎవరైనా ఠపీమని కింద పడాల్సిందే. స్టేటస్ సింగిల్.
9) అలేఖ్య నిహారిక - ఏదో ఒక అనామక ఎం ఎన్ సీ లో ఎందుకూ పనికిరాని ఉద్యోగం చేసుకుంటూ ఉన్న అలేఖ్య ఉన్నట్టుండి యూట్యూబ్ ను ఎంచుకుంది. ఆమె క్రియేటివిటీ ఆమెను యూట్యూబ్ సెన్సేషన్ గా మార్చేసింది. ఆమెను ఇప్పుడందరూ దేత్తడి తెలంగాణ పిల్లగానే గుర్తిస్తున్నారు. కెమెరాతో ఆమెకు పుట్టుకనుంచే దోస్తీ పుట్టినట్టుంది. అంత ఈజ్ తో నటిస్తుంది. అందుకే ఆమెకు అంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. స్టేటస్ - సింగిల్.
10) నవ్య స్వామి - నా పేరు మీనాక్షిలో మీనాక్షి, కంటే కూతుర్నే కనాలిలోని ఇందుమతిగా వ్యూయర్ల గుండెల్లో తిష్ట వేసింది నవ్య. ఆమె ఆమె కథలో ఐశ్వర్యగా కూడా అలరిస్తోంది. ఆమెను చిన్ని తెర త్రిష గా చాలా మంది అభివర్ణిస్తూంటారు. అలంటి లుక్స్, అద్భుతమైన చిరునవ్వు ఆమె చెరగని ఆస్తులు. స్టేటస్ సింగిల్.
సోషల్ మీడియా స్టార్ అశు రెడ్డి, నటి మంచు లక్ష్మి, లహరీ షారి, అనసూయ భరద్వాజ్, హిమజా మల్లి రెడ్డి వంటి వారు కూడా తమ అందాలు, అభినయం, హొయలతో అలరించి తొలి పదిహేను జాబితాలో చోటు సంపాదించుకున్నారు. సొంత ఫ్యాన్ ఫాలోయింగ్ తో వీరు కూడా హృదయాలను చూరగొంటున్నారు. ఈ మోస్ట్ డిజైరబుల్ లిస్టుతో మీరు ఏకీభవిస్తారా? మీ చాయిస్ లేమిటి? ఒక్కసారి చెప్పేయకూడదూ?