శ్రీశైలం : పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానానికి సమీపంలోని ఘాట్ రోడ్డుపై పలి కనిపించడంతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఘాట్ రోడ్డుపై పులి క‌నిపించ‌డంతో ఎక్క‌డి వాహానాలు అక్క‌డే నిలిపి వేశారు.

వివ‌రాల్లోకి వెళితే.. శ్రీశైలం దేవస్థానానికి 10 కిలో మీటర్ల దూరంలోని ఆంజనేయ స్వామి గుడి దగ్గరలో చిన్నారుట్ల వద్ద పులి సంచ‌రించింది. రోడ్డుపై పులి క‌నిపించ‌డంతో భ‌క్తులు ఎక్క‌డి వాహానాల‌ను అక్క‌డే నిలిపివేశారు. రోడ్డుకు అడ్డంగా భక్తుల వాహనాలు వెళ్లకుండా 20 నిమిషాలు పులి అక్క‌డే ఉండిపోయింది. దీంతో భ‌క్తులు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. వెంట‌నే ఫారెస్టు అధికారుల‌కు స‌మాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఫారెస్టు అధికారులు సంఘటనా స్థలానికి వచ్చే సమయానికి పులి అక్కడి నుంచి అడవిలోకి వెళ్లిపోయింది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.