కంగనా రనౌత్‌కు అత్యాచార బెదిరింపులు

By సుభాష్  Published on  21 Oct 2020 6:05 AM GMT
కంగనా రనౌత్‌కు అత్యాచార బెదిరింపులు

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఆమెకు అత్యాచార బెదిరింపులు వచ్చాయి. ప్రస్తుతం కంగనా తన సోదరుడి పెళ్లి వేడుకల్లో బిజీగా ఉన్నారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో ఆమె అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె షేర్‌ చేసిన కొన్ని ఫోటోలకు ఒడిశాకు చెందిన ఓ న్యాయవాది నుంచి అత్యాచార బెదిరింపులతో కూడిన కామెంట్లు వచ్చాయి. నడిరోడ్డుపై అత్యాచారం చేస్తా.. అంటూ వచ్చిన కామెంట్లను చూసి నెటిజన్లు సైతం షాక్‌కు గురవుతున్నారు. అయితే తన ఫేస్‌ బుక్‌ ఖాతా హ్యాక్‌కు గురైందని సదరు న్యాయవాది తెలియజేశారు. ఈ మేరకు ఓ పోస్టు కూడా పెట్టారు. నా ఫేస్‌ బుక్‌ ఖాతా హ్యాక్‌ చేసి దాని నుంచి అసభకరమైన కామెంట్లు పెట్టారు. ఇది చూసే నేను షాక్‌కు గురయ్యారు. సమాజంలో స్త్రీల పట్ల, సమాజంపట్ల ఎంతో గౌరవం ఉంది. నా అకౌంట్‌ నుంచి ఇలాంటి కామెంట్లు రావడం నన్ను ఎంతగానో బాధ కలిగిస్తోంది... అని పోస్టు పెట్టారు. అయితే ఆయన చేసిన కామెంట్లపై కంగనా ఇంకా స్పందించలేదు.

కాగా, మతపరమైన రెచ్చగొట్టే విధంగా కంగనా రనౌత్‌, ఆమె సోదరి రంగోలి సోషల్‌ మీడియా ద్వారా పోస్టులు చేస్తున్నారని పేర్కొంటు ఓ వ్యక్తి ముంబైక్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు.. ఇద్దరిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఆ మేరకు కేసు కూడా నమోదైంది. ఇప్పటికే వ్యవసాయ చట్టాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ కోర్టు ఆదేశాల మేరకు పోలీసుస్టేషన్‌లో కంగనాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాగా, ఇటీవల బాంద్రా కోర్టు ఆదేశంలో ముంబై పోలీసులు దేశ ద్రోహం కింద కేసున నమోదు చేసిన విషయం తెలిసిందే.

Next Story