వృద్ధుని వయస్సు 112 ఏళ్లు.. గిన్నీస్ బుక్‌లో రికార్డ్
By సుభాష్ Published on 15 Feb 2020 3:40 PM IST
ప్రపంచంలో అత్యంత ఎక్కువ వయస్సు కలిగిన వ్యక్తిగా జపాన్‌కు చెందిన చిటెట్స్ వటనాబె ప్రపంచ రికార్డుకెక్కారు. ఆయన వయస్సు 112 ఏళ్లు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా గిన్నీస్ బుక్‌లో ఎక్కారు. ఇక గిన్నీస్ బుక్ రికార్డ్ ప్రతినిధుల వివరాల ప్రకారం.. చిటెట్స్ వటనాబె 1907లో ఉత్తర జపాన్‌లోని నీగటాలో జన్మించారు. బుధవారం నీగోటాలోని ఓ నర్సింగ్‌హోంలో ఆయనకు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు సర్టికెట్‌ను అందజేశారు. ఈయన వచ్చే నెలలో 113 సంవత్సరంలోకి అడుగు పెట్టనున్నాడు. చిటెట్స్ 112 ఏళ్లలో కూడా ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రపంచం నంబర్ 1 అని చెప్పే విధంగా చిటెట్స్ వటనాబె కాలిగ్రాఫి బ్యానర్‌ను కూడా తయారు చేసుకున్నాడు.
ఆరోగ్య రహస్యం ఇదే..
ఇన్నేళ్లలో తన ఆరోగ్య రహస్యాన్ని వెల్లడిస్తున్నాడు చిటెట్స్ వటనాబె. కోపం తెచ్చుకోకుండా ముఖం మీద చిరునవ్వు చిందించడం అని చెప్పుకొచ్చారు. అగ్రికల్చర్ పాఠశాల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వటనాబె, ఆ తర్వాత తైవాన్‌లోని దాయ్ నిప్పన్‌మెయిజి షుగర్ కంపెనీలో కాంట్రాక్ట్ పనుల్లో చేరాడు. గత 18 ఏళ్లుగా తైవాన్‌లో నివసిస్తున్నాడు. ఆయనకు ఐదుగురు సంతానమని గిన్నీస్ ప్రతినిధులు తెలిపారు. ప్రపంచంలో అత్యంత వృద్ధుడిగా రికార్డుకెక్కిన మసాజొనొనాక అనే వృద్ధుడు గత నెలలో మరణించారు. తాజాగా ఆయన రికార్డును చిటెన్స్ బద్దలు కొట్టేశారు. కాగా, ప్రపంచంలో అత్యంత మహిళ వృద్ధురాలు కానె టనానా (117). వీరంతా కూడా జపానీయులే కావడం విశేషం.