యువతికి తాళి కట్టిన యువకుడు.. బస్సులో వెళ్తుండగా..!

By Newsmeter.Network  Published on  11 Dec 2019 4:04 AM GMT
యువతికి తాళి కట్టిన యువకుడు.. బస్సులో వెళ్తుండగా..!

చెన్నై: బస్సులో ప్రయాణిస్తున్న ఓ యువతికి యువకుడు తాళి కట్టిన ఘటన వేలూరు జిల్లాలో చోటు చేసుకుంది. యువతి మంగళవారం ఉదయం ఆంటూరు నుంచి వాణియంబాడికి బస్సులో ప్రయాణిస్తుండగా అదే బస్సులోకి ఓ యువకుడు ఎక్కాడు. బస్సులో యువకుడు తన వెంట తెచ్చుకున్న తాళిని యువతి మెడలో కట్టాడు. దీంతో బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. వెంటనే గమనించిన ప్రయాణికులు యువకుడి పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం వాణియంబాడి పోలీసులకు అప్పగించారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. యువకుడు జగన్‌ సాండ్రోర్‌ కుప్పం ప్రాంతానికి చెందిన వాడని తెలిపారు. స్థానికంగా ఉంటున్న ఆ యువతిని కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాడని, కానీ ఆ విషయం యువతి చెప్పలేదని పోలీసులు తెలిపారు. ఇటీవలే యువతి పెళ్లి నిశ్చయం అయ్యిందని, విషయం తెలసుకున్న జగన్‌ యువతికి ప్రేమిస్తున్నానని చెప్పాడన్నారు. కానీ ఆ యువతి ప్రేమ పెళ్లికి నిరాకరించడంతో జగన్‌ ఆగ్రహంతో ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు.

Next Story
Share it