తెలంగాణలో 2 లక్షలకు చేరువలో కరోనా కేసులు.. వెయ్యి దాటిన మరణాలు

By సుభాష్  Published on  23 Sep 2020 4:29 AM GMT
తెలంగాణలో 2 లక్షలకు చేరువలో కరోనా కేసులు.. వెయ్యి దాటిన మరణాలు

తెలంగాణలో కరోనా మహమ్మారి ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఒక రోజు కేసుల సంఖ్య తగ్గినా.. మరుసటి రోజు పెరుగుతోంది. ఏదీ ఏమైనా పూర్తిగా తగ్గిపోయేంతా రోజులు ఇంకా దూరంగానే ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పాజిటివ్‌ కేసులపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,296 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, కొత్తగా 10 మంది మృతి చెందారు. ప్రతి రోజు కూడా మరణాల సంఖ్యకూడా ఏ మాత్రం తగ్గడం లేదు.

గడిచిన 24 గంటల్లో ..

పాజిటివ్‌ కేసుల సంఖ్య - 2,296

మరణాల సంఖ్య - 10

కోలుకున్నవారు - 2,062

రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య -1,77,070

మొత్తంమరణాల సంఖ్య - 1062

మొత్తం యాక్టివ్‌ కేసులు - 29,873

ఐసోలేషన్‌లో ఉన్న వారి సంఖ్య - 23,527

రాష్ట్రంలో కోలుకున్నవారు - 1,46,135

రాష్ట్రంలో మరణాల రేటు - 0.59 శాతం

దేశంలో మరణాల రేటు - 1.59 శాతం

రాష్ట్రంలో కోలుకున్నవారి రేటు - 82.52 శాతం

Next Story