టీడీపీ ర్యాలీకి అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

By Newsmeter.Network  Published on  11 Jan 2020 11:05 AM GMT
టీడీపీ ర్యాలీకి అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

తిరుప‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారాచంద్ర‌బాబు నాయుడు తిరుపతి లోని బాలాజీ కాలనీలోని జ్యోతిరావు పూలే విగ్రహం నుండి నాలుగుకాళ్ళ మండపం వరకు నిర్వ‌హించే ర్యాలీ, స‌భ‌కు అనుమ‌తులు లేవ‌ని అర్బన్ జిల్లా ఎస్పి డా. గజరావు భూపాల్ తెలిపారు.

తిరుపతి లోని బాలాజీ కాలనీ జ్యోతిరావు పూలే విగ్రహం నుండి గాంధీ రోడ్, నాలుగుకాళ్ళ మండపం వరకు ర్యాలీ అనుమతి కోరుతూ తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తిరుపతి జిల్లా ఎస్పీ డా. గజరావు భూపాల్ ని అనుమతి కోరారు. అయితే పూలే విగ్రహం నుండి నాలుగుకాళ్ళ మండపం వరకు ఉన్న రోడ్డు చాలా చిన్న‌ది. యాత్రికులు, ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతం కావ‌డం, వాణిజ్య సముదాయాలు అధికంగా ఉండ‌డంతో నిత్యం ర‌ద్దీగా ఉండ‌డంతో అక్క‌డ ర్యాలీకి ఎస్పీ అనుమ‌తి ఇవ్వ‌లేదు.

Next Story
Share it