బిగ్‌బ్రేకింగ్ : రాయ‌పాటి 'ట్రాన్స్‌స్టాయ్' కంపెనీపై సీబీఐ దాడులు

By Newsmeter.Network  Published on  31 Dec 2019 3:44 AM GMT
బిగ్‌బ్రేకింగ్ : రాయ‌పాటి ట్రాన్స్‌స్టాయ్ కంపెనీపై సీబీఐ దాడులు

మాజీ ఎంపీ, టీడీపీ సీనియ‌ర్ నేత రాయ‌పాటి సాంబ‌శివ‌రావుకు సంబంధించిన ట్రాన్స్‌స్టాయ్ కంపెనీ మీద సీబీఐ అధికారులు దాడులు నిర్వ‌హించారు. ఈ కంపెనీ గతంలో పోల‌వ‌రం ప్రాజెక్ట్ నిర్మాణ ప‌నులు నిర్వ‌హించింది. స‌ద‌రు కంపెనీ ప్రాజెక్ట్ ప‌నుల నిమిత్తం యూనియ‌న్ బ్యాంక్‌లో రూ. 300 కోట్ల రుణం తీసుకుంది.

ఏదైతే ప్రాజెక్ట్ ప‌నుల నిమిత్తం ఈ రుణం తీసుకుందో.. ప‌నులు నిర్వ‌హించ‌కుండా నిధులు సొంత ప‌నుల నిమిత్తం మ‌ళ్లించుకున్నారు. ఈ విష‌య‌మై సీబీఐ అధికారులు ట్రాన్స్‌స్టాయ్ కంపెనీకి సంబంధించి ఈడీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు, చైర్మ‌న్ చెరుకూరి శ్రీధ‌ర్, సీఈఓ, డైరెక్ట‌ర్ల కార్యాల‌యాల‌పై ప‌లు చోట్ల ఏక‌కాలంలో ఈ దాడులు చేప‌ట్టారు.

ప‌నులు చేప‌ట్ట‌కుండా నిధులు దుర్వినియోగం చేసారన్న విష‌యం కొద్దికాలం పాటు ఎన్‌సీఎల్‌టీలో నానింది. ఎన్నో రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు సృష్టించిన ఈ వ్య‌వ‌హారం చివ‌రికి ఈ మ‌లుపు తీసుకుంది.

ఇదిలావుంటే.. టీడీపీ హ‌యాంలో పోల‌వ‌రం ప‌నుల‌ను ద‌క్కించుకున్న ట్రాన్స్‌స్టాయ్ కంపెనీ నిర్మాణ ప‌నుల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించ‌లేక‌పోయింది. ఆ త‌ర్వాత ప్రాజెక్ట్ నిర్మాణ ప‌నుల‌ను న‌వ‌యుగ సంస్థ చేప‌ట్టింది. పనులు చేయించుకుని సబ్‌ కాంట్రాక్టర్లకు డబ్బులు ఎగ్గొట్టిందంటూ ట్రాన్స్‌ స్ట్రాయ్ కంపెనీ ఈడీ సాంబశివరావును గ‌తంలో బాధితులు ఘొరావ్ చేశారు. చిన్నచిన్న సబ్‌ కాంట్రాక్టర్లకు 23 కోట్ల రూపాయలు కంపెనీ చెల్లించాల్సి ఉంది. అప్ప‌ట్లో ఈ విష‌య‌మై పెద్ద దుమార‌మే రేగింది.

Next Story