స్పీకర్ నిర్లక్ష్యం..టీడీపీ వాకౌట్
By రాణిPublished on : 16 Dec 2019 11:08 AM IST

వెలగపూడి : ఆరవ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన కొద్దిసేపటికే అసెంబ్లీ నుంచి చంద్రబాబు సహా టీడీపీ నేతలు వాకౌట్ చేశారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో హౌసింగ్ పై చర్చలో భాగంగా మంత్రి బొత్స సత్యనారాయణ ప్రసంగించారు. అయితే సదరు మంత్రిగారు చెప్పింది ఏమీ అర్థం కాలేదని, తమకు కూడా మాట్లాడే అవకాశాన్ని కల్పించాలని టీడీపీ నేతలు స్పీకర్ ను కోరారు. ఆ తర్వాత స్పీకర్ అవకాశం ఇవ్వకుండానే వేరే ప్రశ్నకు వెళ్లడంతో టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తి చెందారు. స్పీకర్ వైఖరికి నిరసనగా టీడీపీ సభ్యులంతా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. టీడీపీ వాకౌట్ తర్వాత అసెంబ్లీ సమావేశాలు కంటిన్యూ అవుతున్నాయి.
Next Story