కర్నూలులో దారుణం చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ నేత మంజుల సుబ్బారావు దారుణ హత్యకు గురయ్యారు. వేట కొడవళ్లతో తల నరికిన ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. సుబ్బారావు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి ప్రధాని అనుచరుడు. కొలిమిగండ్ల మండలం బెలూం గుహల వద్ద జరిగిన ఈ దారుణం తీవ్ర సంచలనం రేపింది. పట్టపగలే ఈ హత్య జరగడంతో పర్యాటకులు, స్థానికులు భయాందోళన చెందారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.