టీ20 ర్యాంకింగ్స్ విడుద‌ల‌.. టాప్-5లో భార‌త బ్యాట్స్ మెన్స్ కు ద‌క్క‌ని చోటు

By Newsmeter.Network  Published on  11 Jan 2020 12:42 PM GMT
టీ20 ర్యాంకింగ్స్ విడుద‌ల‌.. టాప్-5లో భార‌త బ్యాట్స్ మెన్స్ కు ద‌క్క‌ని చోటు

అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి (ఐసీసీ) తాజాగా టీ20 ర్యాంకింగ్స్ ను విడుద‌ల చేసింది. శ్రీలంక‌తో 3టీ20ల సిరీస్ లో విశేషంగా రాణించి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్న న‌వ‌దీస్ సైనీ టాప్‌-100లోకి వ‌చ్చాడు. టీ20 సిరీస్ లో 5 వికెట్ల‌తో స‌త్తా చాటిన ఈ యువ బౌల‌ర్ టీ20 ర్యాంకింగ్స్ లో 146 స్థానాలు ఎగ‌బాకి 98వ స్థానానికి చేరుకున్నాడు. మరొక బౌలర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ 92వ స్థానంలో నిలిచాడు.

పాకిస్థాన్ బ్యాట్స్ మెన్ బాబార్ ఆజాం 879 రేటింగ్ పాయింట్ల‌తో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతుండ‌గా ఆస్ట్రేలియాకు చెందిన ఆరోన్ ఫించ్ 810 రేటింగ్ పాయింట్ల‌తో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక భార‌త బాట్స్ మెన్ల విష‌యానికి వ‌స్తే 760 రేటింగ్‌ పాయింట్లతో లోకేష్ రాహుల్ ఆరో స్థానంలో ఉండ‌గా ప‌రుగుల యంత్రం విరాట్ కోహ్లీ 683 రేటింగ్‌ పాయింట్లతో 9వ స్థానానికి ఎగబాకాడు. శిఖర్‌ ధావన్‌ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని 15వ స్థానానికి చేరుకున్నాడు.

టీ20 బ్యాట్స్ మెన్స్ ర్యాంకింగ్స్..

ర్యాంక్ఆట‌గాడి పేరుదేశం రేటింగ్ పాయింట్లు
1బాబర్ ఆజంపాకిస్థాన్ 879
2 ఆరోన్ ఫించ్ఆస్ట్రేలియా810
3డేవిడ్ మలన్ ఇంగ్లాండ్ 782
4కోలిన్ మున్రోన్యూజిలాండ్ 780
5గ్లెన్ మాక్స్వెల్ఆస్ట్రేలియా766
6లోకేష్ రాహుల్ఇండియా760
7ఎవిన్ లూయిస్వెస్టిండీస్699
8 హజ్రా తుల్లా ఆప్ఘ‌నిస్థాన్692
9విరాట్ కోహ్లీ ఇండియా683
10మోర్గాన్ఇంగ్లాండ్‌653

బౌల‌ర్ల విష‌యానికి వ‌స్తే ఆప్ఘ‌నిస్థాన్ బౌల‌ర్ రషీద్ ఖాన్ 749 రేటింగ్ పాయింట్ల‌తో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతుండ‌గా అదే దేశానికి చెందిన ముజీబ్ ఉర్ రెహ్మాన్ 742 రేటింగ్ పాయింట్ల తో రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు. ఇక భార‌త బౌల‌ర్ల విష‌యానికి వ‌స్తే వాషింగ్టన్ సుందర్ 614 రేటింగ్ పాయింట్ల‌తో 14వ స్థానంలో కొన‌సాగుతున్నాడు. సుంద‌ర్ త‌ప్ప టాప్ 20లో మ‌రే భార‌త బౌల‌ర్ లేడు.

టీ20 బౌల‌ర్ల ర్యాంకింగ్స్..

ర్యాంక్ఆట‌గాడి పేరుదేశం రేటింగ్ పాయింట్లు
1 రషీద్ ఖాన్ఆప్ఘ‌నిస్థాన్749
2ముజీబ్ ఉర్ రెహ్మాన్ఆప్ఘ‌నిస్థాన్742
3మిచెల్ సాంట్నర్న్యూజిలాండ్698
4ఇమాద్ వసీంపాకిస్థాన్681
5ఆడమ్ జాంపాఆస్ట్రేలియా674
6ఆండిలే ఫెహ్లుక్వాయో సౌతాఫ్రికా665
7ఆదిల్ రషీద్ ఇంగ్లాండ్660
8షాదాబ్ ఖాన్పాకిస్థాన్657
9అష్టన్ అగర్ఆస్ట్రేలియా649
10 క్రిస్ జోర్డాన్ ఇంగ్లాండ్ 640

ఆల్ రౌండ‌ర్ల జాబితాలో ఆప్ఘ‌నిస్థాన్ కు చెందిన మహ్మద్ నబీ 319 రేటింగ్ పాయింట్ల‌తో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతుండ‌గా ఆస్ట్రేలియాకు చెందిన గ్లెన్ మాక్స్వెల్ 231 రేటింగ్ పాయింట్ల‌తో రెండో స్థానంలో ఉన్నాడు. టాప్ -20లో భార‌త ఆల్ రౌండ‌ర్ల‌కు చోటు ద‌క్క‌లేదు.

టీ20 ఆల్ రౌండ‌ర్ల ర్యాంకింగ్స్..

ర్యాంక్ఆట‌గాడి పేరు దేశంరేటింగ్ పాయింట్లు
1మహ్మద్ నబీఆప్ఘ‌నిస్థాన్319
2గ్లెన్ మాక్స్వెల్ఆస్ట్రేలియా231
3సీన్ విలియమ్స్జింబాబ్వే212
4రిచర్డ్ బెర్రింగ్టన్స్కాట్లాండ్194

ఇక టీం ర్యాంకింగ్స్ విష‌యానికి వ‌స్తే పాకిస్థాన్ 270 పాయింట్ల‌తో అగ్ర‌స్థానంలో ఉండ‌గా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ లు ఉన్నాయి. 260 పాయింట్ల‌తో టింఇండియా 5 స్థానంలో ఉంది.

Next Story