ఆ ఇద్ద‌రిలో ఎవ‌రికి ఎస్వీబీసీ చైర్మన్ ప‌గ్గాలు..?

By Newsmeter.Network  Published on  13 Jan 2020 11:37 AM GMT
ఆ ఇద్ద‌రిలో ఎవ‌రికి ఎస్వీబీసీ చైర్మన్ ప‌గ్గాలు..?

తిరుమల : ఎస్వీబీసీ చైర్మన్ ప‌ద‌వికి పృథ్వీ రాజ్ రాజీనామ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక కొత్త చైర్మ‌న్ గా ఎవ‌రు వ‌స్తారు అనేది ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సినీ ఇండస్ట్రీకి చెందిన వారిని నియ‌మిస్తారా..? లేక వైసీపీ కి చెందిన నాయ‌కుల‌ను నియ‌మిస్తారా అనే విష‌యంలో ప్ర‌స్తుతం అందిరిలో ఆస‌క్తి నెల‌కొనింది. కాగా చైర్మ‌న్ రేసులో ప్ర‌ముఖంగా ఓ ఇద్ద‌రి పేర్లు వినిపిస్తున్నాయి.

వారిలో ఒకరు ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కాగా.. మరొకరు మీడియాలో పేరుగాంచిన యాంకర్ స్వప్న. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి శ్రీనివాస్ రెడ్డి అత్యంత సన్నిహితుడు. దీంతో వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈయనకు కీలక పదవి ఇస్తారని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. కాగా ఉదయం నుంచి స్వప్న పేరే ఎక్కువగా వినిపించగా.. ఆమె ఇప్పటికే ఎస్వీబీసీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండటంతో శ్రీనివాస్‌రెడ్డి పేరును ఫిక్స్ చేశారని అధికారికంగా ప్ర‌క‌టించ‌డ‌మే త‌రువాయి అనే వార్తలు వినిపిస్తున్నాయి.

Next Story
Share it