ప్రాణాలు తీసిన సెల్పీ పిచ్చి..నలుగురు మృతి..!

By Newsmeter.Network  Published on  7 Oct 2019 6:50 AM GMT
ప్రాణాలు తీసిన సెల్పీ పిచ్చి..నలుగురు మృతి..!

చెన్నై: సెల్ఫీ తీసుకోబోతూ జలాశయంలో పడి నలుగురు మృతి చెందారు. ఈ విషాద ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా ఊత్తంగర్తె సమీపంలోని సాంబారు జలాశయంలో జరిగింది. జలాశయానికి సమీపంలోని ఒడ్డపట్టి గ్రామానికి చెందిన సంతోష్ (14),స్నేహ(19), వినోద్(18), నివేద(20) జలాశయం అందాలు చూసేందుకు వెళ్లారు. అక్కడ సెల్పీ తీసుకోబోతుండగా అదుపుతప్పి గట్టుపై నుంచి నీటిలో పడిపోయారు. స్థానికులు వారిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి నాలుగు మృతదేహాలను బయటకు తీశారు.

దేశవ్యాప్తంగా ఇలా సెల్ఫీలు తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయేవారిక సంఖ్య అధికమవుతుంది. దేశంలో ఏదో ఒక మూల రోజూ సెల్ఫీలు తీసుకుంటూ ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని రోజుల క్రితం తెలంగాలో కూడా ఓ యువకుడు చెక్ డ్యామ్ దగ్గర టాక్ టాక్ కోసం వీడియో తీసుకుంటూ కొట్టుకుపోయాడు. టిక్ టాక్, సెల్ఫీలపై యువతకు ఉన్న మోజు చివరికి వారి ప్రాణాలు మీదకు తెస్తుంది. ఫొటోలు తీసుకోవడం, సరదాగా బయటలకు వెళ్లడం తప్పు కాదు. కాని..బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని యువత గుర్తు పెట్టుకోవాలి. మీరు ప్రాణాలు కోల్పోయి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగల్చవద్దు.

Next Story
Share it