రూ.400 కోట్ల రుణం ఎగవేతకు సంబంధించి వేలానికి సుజానా గ్యారెంటర్ల ఆస్తులు

By సుభాష్  Published on  20 Feb 2020 2:04 PM GMT
రూ.400 కోట్ల రుణం ఎగవేతకు సంబంధించి వేలానికి సుజానా గ్యారెంటర్ల ఆస్తులు

బీజేపీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి సుజానా చౌదరికి బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గట్టి షాకిచ్చింది. గతంలో సుజానా చౌదరి డైరెక్టర్‌గా ఉన్న సుజానా యూనివర్సల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ పేరిట బకాయి పడ్డ రూ.400 కోట్ల రికవరీకి సంబంధించి ఈరోజు గ్యారెంటర్ల ఆస్తుల జప్తునకు సెల్‌ నోటీసును ఇచ్చింది. ఈ నోటీసులో గ్యారెంటర్లకు సంబంధించి 11 మంది ఆస్తులు జప్తు చేస్తున్నట్లుగా పేర్కొంది.

గ్యారెంటర్లుగా.. యలమంచిలి సత్యనారాయణ చౌదరి (వైఎస్‌ చౌదరి), వై. శివలింగ ప్రసాద్‌, జితిన్‌ కుమార్‌, శివరామకృష్ణ, ఎస్‌టి. ప్రసాద్‌, గొట్టుముక్కుల శ్రీనివాస రాజు, స్ల్పెండిడ్‌ మెటల్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌, సుజనా క్యాపిటల్‌ సర్వీస్‌ లిమిటెడ్‌, సుజనా పంప్స్‌ అండ్‌ మోటర్స్‌ లిమిటెడ్‌, న్యూ ఆన్‌ టవర్స్‌ లిమిటెడ్‌, సార్క్‌ నెట్‌ లిమిటెడ్‌లను నోటీసులో పేర్కొంది.

Sujana Universal Industries

కాగా, మార్చి 20వ తేదీ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆస్తుల ఇన్స్‌ పెక్షన్‌ జరపనున్నట్లు నోటీసులో తెలిపింది. దీనికి సంబంధించి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో బిడ్‌ వేయడానికి చివరి గడువుగా పేర్కొంది. అలాగే 23వ తేదీ ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మూడు విడతల వారిగా ఆస్తుల వేలం ప్రక్రియను చేపట్టనున్నట్లు నోటీసులో వెల్లడించింది.

Next Story