జబర్దస్త్‌ సుడిగాలి సుధీర్‌కు కరోనా..!

By సుభాష్  Published on  21 Oct 2020 5:21 AM GMT
జబర్దస్త్‌ సుడిగాలి సుధీర్‌కు కరోనా..!

కరోనా మహమ్మారి సామాన్యుడి నుంచి సెలబ్రెటీల వరకు ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రెటీలు కరోనా బారిన పడ్డారు. చిన్నా పెద్ద తేడా లేకుండా కరోనా మహమ్మారి అందరికి సోకుతోంది. ఇక తాజాగా బుల్లితెర నటుడు సుడిగాలి సుధీర్‌ కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. అక్టోబర్‌ 18న సుధీర్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు సమాచారం. ప్రస్తుతం అతడు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై సుధీర్‌ ఇంకా స్పందించలేదు. మరో వైపు సుధీర్‌కు కరోనా నిర్ధారణ అయినట్లు వార్తలు వస్తుండటంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. మరీ సుధీర్‌కు కరోనా వస్తే ఆయనతో ఉండే వారి పరిస్థితి ఏంటన్నది.. షోలో పాల్గొనేవారి పరిస్థితి ఎలా ఉంటుందనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఆయనతో పాటు ఇంకా చాలా మంది కూడా కరోనా బారిన పడే అవకాశాలున్నాయి.

ఎందుకంటే సుధీర్‌తో పాటు జబర్దస్త్‌ షోలో పాల్గొనే చాలా మంది అంతా కలిసే ఈ మధ్య అన్ని షూటింగ్‌లో పాల్గొంటున్నారు. పైగా మొన్న దసరా స్పెషల్‌ ఈవెంట్‌ అక్కా ఎవడే అతగాడులో రష్మీ, వర్షిణి, సంగీత, శేఖర్‌ మాస్టర్‌ తదితరులు అంతా కలిసి షూటింగ్‌ చేశారు. దాంతో అంతా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. కరోనా వచ్చిన తర్వాత కూడా చాలా జాగ్రత్తలు తీసుకునే జబర్దస్త్‌తో పాటు అన్ని షూటింగ్‌లు చేస్తున్నాడు సుధీర్‌. ఆయనతో పాటే మిగిలిన వాళ్లు కూడా వస్తున్నారు. ఈ క్రమంలో జబర్దస్త్‌ కామెడీ షోకు కూడా కరోనా అంటుకుంటే పరిస్థితి ఎలా ఉండబోతుందనేది చూడాలి.

Next Story