ఒక గొడవ విద్యార్థి ప్రాణాలమీదికి తెచ్చింది

By రాణి  Published on  3 Jan 2020 7:36 AM GMT
ఒక గొడవ విద్యార్థి ప్రాణాలమీదికి తెచ్చింది

ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన ఒక గొడవ ఒకరి బ్రెయిన్ డెడ్ కు కారణమయింది. వివరాల్లోకి వెళ్తే...గుంటూరుజిల్లా కొత్తపేటలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న నవీన్, మాత్యూస్ అనే ఇద్దరు విద్యార్థుల మధ్య గురువారం మధ్యాహ్న భోజన సమయంలో తలెత్తిన స్వల్ప వివాదం కాస్త చిలికి చిలికి గాలి వానలా ఘర్షణకు దారితీసింది. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు గుద్దుతూ దాడికి పాల్పడటంతో..నవీన్ తీవ్రంగా గాయపడి స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే స్పందించిన తోటి విద్యార్థులు నవీన్ ను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేసేందుకు నవీన్ ను పరీక్షించగా..అతడికి బ్రెయిన్ డెడ్ అయినట్లు తేల్చారు.

నవీన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాత్యూస్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మాత్యూస్ మైనర్ కావడంతో..అతడిని జువైనల్ హోంకు తరలించే అవకాశం ఉంది. కాగా..విద్యార్థులు ఇలా ఘర్షణలు పడుతుంటే..కళాశాల యాజమాన్యం ఏం చేస్తుందన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

Next Story
Share it