దేశీయ స్టాక్‌ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. చైనాలో మొదలైన కరోనా వైరస్‌ కారణంగా అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు నెలకొడంతో కీలక రంగాల షేర్లు కుదేలవుతున్నాయి. ఈ రోజు కూడా మార్కెట్‌లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. దాదాపు 1100 పాయింట్ల నష్టంతో 38,635 పాయింట్ల వద్ద సెన్సెక్స్‌ ట్రేడవుతోంది. అంతేకాకుండా నిప్టీ కూడా 280 పాయింట్లు కోల్పోయి 11,319 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. కరోనా భయంతో అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు. అలాగే ఐటీ, మెటల్‌, రియల్‌ ఎస్టేట్‌ సహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. స్టాక్‌ మార్కెట్లపై కూడా కరోనా ఎఫెక్ట్‌ ప్రభావం భారీగానే చూపుతోంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.