సినీ ప్రేమికులందరికి సుపరిచితుడైన డైరెక్టర్‌ స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌. ఆయన తెరకెక్కించిన చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన కుమారై సంచలన నిర్ణయం తీసుకుంది. నటీగా ఎంట్రీ ఇవ్వనుందట. మాములేగా.. సినీ రంగానికి చెందిన వారి వారి వారసులు నటీనటులు ఎంట్రీ ఇవ్వడం. ఇందులో ఎముందిలే అని అనుకుంటున్నారా.. అసలు మ్యాటర్‌ తెలుస్తే అలా అనరు. ఆమె నటీగా ఎంట్రీ ఇవ్వబోయేది.. మాములు సినిమాల్లో కాదట. పోర్న్‌ మూవీస్‌లో.

23 ఏళ్ల మికేలాను స్పీల్‌బర్గ్‌ ఆయన భార్య కేట్‌ కాప్షా దత్తత తీసుకున్నారు. మికేలా సొంతంగా పోర్న్ వీడియోలను నిర్మిస్తున్నారు. మరోవైపు తనకు ఇష్టమైన స్ట్రిప్‌ క్లబ్‌లో ఎంట్రీ కోసం స్ట్రిప్పర్‌ లైసెన్స్‌ పొందేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. మికేలా తన స్టేజ్‌ నేమ్‌ను షుగర్‌ స్టార్‌గా ఎంచుకున్నారని ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ వెల్లడించింది.

ఈ వృత్తి పట్ల వ్యామోహం ఉండటం సిగ్గుపడే విషయం ఎంతమాత్రం కాదని, తానిప్పుడే అడల్ట్‌ వినోద కెరీర్‌ను చేపట్టానని ఇది సానుకూల, సాధికారిక నిర్ణయమని అన్నారు. సురక్షిత, పరస్పర అంగీకారమైన పనులు చేపట్టాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. తన నిర్ణయానికి తల్లితండ్రులు విస్మయం చెందలేదని.. కాబోయే భర్త చక్‌ పాంకో (47) సైతం పోర్న్‌ స్టార్‌గా తన ఎంట్రీకి మద్దతుగా నిలిచారని చెప్పింది ఈ భామ. తన అభిమానుల్లో ఎక్కువగా వయసు మళ్లిన వైట్‌మెన్‌లను ఎంపిక చేసుకుంటానని, పాంకోపై గౌరవంతో తాను కేవలం సోలో వీడియోలే చేస్తానని, ఇతరులతో కెమెరాల ముందు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనే వీడియోలు ఉండవని వెల్లడించింది. అంత పెద్ద దర్శకుడి కూతురు అయ్యి ఉండి ఇలాంటి సినిమాలు చేయండం ఏంటీ అంటూ కొందరు విమర్శిస్తుంటే మరి కొందరు మాత్రం ఆమె నిర్ణయాన్ని సమర్ధిస్తున్నారు.

ఇదిలా నిత్యం వివాదాల్లో ఉండే మన రామ్‌గోపాల్ వర్మ ఊరుకుంటాడా చెప్పండి. తన ట్విట్టర్‌ వేదికగా కామెంట్ చేశాడు.‘‘స్టీవెన్ స్పీల్‌బర్గ్ తన కూతురు పోర్న్స్టార్ అని తెలిసీ సపోర్ట్ చేసారు. తానో పోర్న్ స్టార్ అని మికేలా తన తండ్రికి చెప్పిందట. ఇందుకు ఆయన కూడా ఒప్పుకున్నారట. పోర్న్‌‌ను ఇంతకంటే ఇంకెవ్వరూ సపోర్ట్ చేయలేరు. ప్రపంచం ఇప్పుడిప్పుడే మారుతోంది’’ అని పేర్కొన్నారు.

ప్రస్తుతం వర్మ ‘దిశ’ అనే సినిమాను తెరకెక్కించడంలో బిజీగా ఉన్నారు. తెలంగాణలో ఓ వెటర్నరీ డాక్టర్‌ను దారుణంగా రేప్‌‌ చేసి దహనం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై వర్మ ‘దిశ’ టైటిల్‌తో సినిమా తీస్తున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.