శాటిలైట్ చెప్పిన సత్యం: నిండు కుండలా శ్రీరామ్‌ సాగర్‌..!

By సత్య ప్రియ  Published on  26 Oct 2019 8:41 AM GMT
శాటిలైట్ చెప్పిన సత్యం: నిండు కుండలా శ్రీరామ్‌ సాగర్‌..!

నిజామాబాద్ లోని శ్రీరంసాగర్ ప్రాజెక్ట్ నిండు కుండను తలపిస్తోంది. ఉపగ్రహ ఛాయచిత్రాలను పరిశీలించినట్లైతే ఈ విషయం అర్ధమవుతుంది. జూలై 29 నుంచి అక్టోబర్ 21, 2019 మధ్యలో ఈ రిజర్వాయర్ లోకి వచ్చిన నీటి ప్రవాహం పోయిన సంవత్సరాల కంటే పెరిగిందని చెప్పవచ్చు. అధికారులు చెప్పినదాని ప్రకారం...గడిచిన 3 సంవత్సరాలలో రిజర్వాయర్ నిండటం ఇదే మొదటిసారి. డిసెంబర్ 15 నుంచి మార్చ్ 31 వరకూ కొనసాగే రబీ కాలంలో ఆ ప్రదేశంలో ఉన్న పోలాల సాగుకి నూటికి నూరు శాతం సరిపోతుంది.

శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ ఎక్షిక్యూటివ్ ఇంజినీర్ రామారావు మాట్లాడుతూ, " ఈ సంవత్సరం(2019) సుమారు 4,20,000 ఎకరాల సాగుకు ఈ నీరు సరిపోతుందన్నారు. గత 2 సంవత్సరాలలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. 3 రోజుల క్రితం డ్యాం లో నీరు ఫుల్ ట్యాంక్ స్థాయికి చేరింది. డిసెంబర్ మూడవ వారం నుంచి రైతులకు నీరు అందిస్తాం" అని అన్నారు.

Befunky Collage 3

2016 నుంచి గోదావరిలోకి నీరు విడుదల కాలేదు. కానీ, ఈ సంవత్సరం రిజర్వాయర్ ఫుల్ ట్యాంక్ స్థాయికి వచ్చినందున 10 టీఎంసీల నీరును నేరుగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కి విడుదల చేశామన్నారు. డ్యాం వద్ద 4 టర్బైన్లు గల హైడ్రో ఎలెక్ట్రిక్ కేంద్రం కూడా ఉంది, అందులో మొత్తం 36 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందన్నారు. .

Befunky Collage 5

ఉత్తర తెలంగాణ కు జీవనాడి అయిన కరీంనగర్, వరంగల్, అదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల వ్యవసాయ అవసరాలకు శ్రీరాం సాగర్ నీరు అందిస్తుంది.

ఇక్రి శాట్ మాజీ శాస్త్రవేత్త, సుబ్బారావు మాట్లాడుతూ, మొదటినుంచీ శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ లోని నీరు ఎప్పుడూ వంద శాతానికి చేరలేదు. అందుకని, భూగర్భ జలాలను వినియోగించుకునే వారు. ఇప్పుడు వర్షం నీరుతో పాటు భూగర్భ జలాలు కూడా తోడయ్యాయి. నీటి వనరుల సంయుక్త ఉపయోగం వల్ల నీరు వృధా అయ్యే అవకాశం ఉందన్నారు.ఈ సంవత్సరం, చుట్టుపక్కల ఉన్న వరి పొలాలకు సరిపడా నీరు అందుతుందని నిపుణులు చెప్తున్నారు.నీటి ప్రవాహం తగు మోతాదులో ఉన్నందు వల్ల, ఈ ప్రదేశంలో భుగర్భ జలాలు కూడా పెరుగుతాయని ఆశిస్తున్నాం, అదనపు భూముల్లో వరి సాగు గురించి ఇంకా తెలియాల్సి ఉంది, అని కూడా చెప్పారు సుబ్బారావు.

Next Story