చూస్తే మీరూ అంటారు అద్దిరిపోయార‌ని.. ర‌వి వ‌ర్మ క‌ళారూపంలో మ‌న హీరోయిన్లు..!

By Newsmeter.Network  Published on  4 Feb 2020 2:21 PM GMT
చూస్తే మీరూ అంటారు అద్దిరిపోయార‌ని.. ర‌వి వ‌ర్మ క‌ళారూపంలో మ‌న హీరోయిన్లు..!

భార‌త దేశంలోని అత్యుత్త‌మ క‌ళాకారుల‌న‌గానే మొద‌ట‌గా గుర్తుకొచ్చే పేరు ర‌వి వ‌ర్మ‌. మ‌రీ ముఖ్యంగా ప్ర‌పంచ వ్యాప్తంగా ఆయ‌న‌కు అభిమానులు ఉన్నారంటే అతిశ‌యోక్తి కాదేమో. అంత‌లా ఆయ‌న గీసిన ప్ర‌తీ చిత్రం ప్రాముఖ్య‌త‌ను సంత‌రించుకున్నాయి. ఈ విష‌యాలు అంద‌రికి తెలిసిన‌వే అయినా తాజాగా ర‌వి వ‌ర్మ చిత్రాల‌ను పోలినవి కొన్ని సోష‌ల్ మీడియాలో ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి.

south actress recreates raja ravi varma paintings

ప్రఖ్యాత ఫోటో గ్రాఫర్ జీ.వెంకెట్ రామ్, రవివర్మ శైలితో పోలిన కొన్ని ఫోటోల‌ను త‌న కెమెరాలో బంధించాడు. అవి కాస్తా బ‌య‌ట‌కు రావ‌డంతో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంతా అక్కినేని, శృతీ హాసన్, ఐశ్వర్య రాజేష్, ఖుష్బు సుందర్‌, మ‌రికొందరు ప్రముఖులు వెంకెట్ రామ్ ఫోటోగ్రఫీ కోసం రవివర్మ చిత్రాలు మాదిరి ఫోజులిచ్చారు.south actress recreates raja ravi varma paintings

దీంతో ర‌వి వ‌ర్మ ప్ర‌తీ చిత్రానికి ఓ ప్ర‌త్యేక‌త ఉన్న‌ట్టే వెంక‌ట్ రామ్ తీసిన ప్ర‌తీ ఫోటోకు ఓ గుర్తింపు ల‌భిస్తోంది. ర‌వి వ‌ర్మ చిత్రాల‌ను ప్ర‌తిభింభించేలా వెంక‌ట్‌రామ్ తీసిన ఫోటోలు చూప‌రుల‌ను తెగ ఆక‌ట్టుకుంటున్నాయి. విచిత్ర‌మో.. యాథృచ్చిక‌మో కానీ సేమ్ టు సేమ్ ర‌వి వ‌ర్మ క‌ళారూపాల‌ను కెమెరా రూపంలో దించేశాడు. దీంతో ర‌వి వ‌ర్మ త‌న ఊహ‌ల‌కు ప‌ని చెబితే.. వెంక‌ట్ రామ్ త‌న కెమెరాకు ప‌ని చెప్పాడంటూ నెటిజ‌న్లు వారి అభిప్రాయాల‌ను కామెంట్ బాక్సుల‌లో నింపుతున్నారు.

Next Story