క్యాస్టింగ్ కౌచ్..ఈ విషయంపై నేటి నటీమణులు ఇప్పుడిప్పుడే స్పందిస్తున్నారు. ఇటీవలే బిగ్ బాస్ బ్యూటీ నందినీ రాయ్ కూడా క్యాస్టింగ్ కౌచ్ పై తన అభిప్రాయాన్ని ఓ మీడియాతో షేర్ చేసుకున్నారు. తాజాగా కౌసల్య కృష్ణమూర్తి ఫేం ఐశ్వర్య రాజేష్ కూడా క్యాస్టింగ్ కౌచ్ పై తన అభిప్రాయాన్ని తెలిపారు.

ఇప్పటి వరకూ కేవలం ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేనివారే లైంగిక వేధింపులకు గురవుతున్నారనుకుంటే పొరపాటే. తమ కుటుంబంలో సినీ నటులు ఉండి, వారి ద్వారా సినిమాల్లోకి వస్తున్న హీరోయిన్లు, ఇతర నటీమణులు కూడా క్యాస్టింగ్ కౌచ్ కు గురవుతున్నారని ఐశ్వర్య రాజేష్ తెలిపారు. ఐశ్వర్య రాజేష్ తండ్రి అయిన రాజేష్ నటుడు. అంతేకాదు..తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి శ్రీ లక్ష్మి కి ఐశ్వర్య రాజేష్ స్వయానా మేనకోడలు. అయినప్పటికీ ఐశ్వర్య ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో లైంగిక వేధింపులను ఎదుర్కొన్నారట. శరీర రంగు ని సాకుగా చూపి చాలా ఇబ్బంది పెట్టేవారని పేర్కొన్నారు. అంతేకాక తనకు రావాల్సిన పేమెంట్లు కూడా సరిగ్గా ఇచ్చేవారు కాదని కూడా ఐశ్వర్య తెలిపారు.

తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిల కన్నా సౌత్ నుంచి వచ్చిన అమ్మాయిలకే ఎక్కువ అవకాశాలొస్తాయని, అందుకు కారణం ఏమిటో కూడా తనకు తెలుసన్నారు ఐశ్వర్య. బుల్లితెర నుంచి టాలీవుడ్ వరకూ అవకాశాల కోసం చాలా మంది ఎలాంటి పనులైనా చేయడానికి సిద్ధంగా ఉంటారని, తాము అలాంటి పనులు చేయలేం కాబట్టే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఐశ్వర్య అభిప్రాయపడ్డారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.