మనస్తాపానికి గురై ఎస్ఐ ఆత్మహత్య

By రాణి  Published on  23 Dec 2019 7:03 AM GMT
మనస్తాపానికి గురై ఎస్ఐ ఆత్మహత్య

హైదరాబాద్ : సూర్యాపేట చెందిన ఎస్సై సైదులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సైదులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సైదులు 2007వ సంవత్సరంలో ఎస్సైగా విధుల్లో చేరాడు. అలాగే 2017 వరకు విధులు నిర్వహిస్తూ తర్వాత కొన్ని కారణాల వల్ల ట్రాఫిక్ ఎస్సైగా బదిలీ అయ్యారు. నగరంలోని మొగల్ పురా పోలీస్ స్టేషన్ తో పాటు ట్రాఫిక్ వింగ్ లో కూడా సైదులు విధులు నిర్వహించాడు. నవంబర్ నెలలో తిరిగి విధుల్లో చేరడానికి రిపోర్ట్ చేయగా సైదులు ను సిసిఎస్ కు 3 నెలల క్రితం బదిలీ చేశారు. ఆ తర్వాత సైదులు ఆరోగ్యం సహకరించకపోవడంతో ప్రమోషన్ రాలేదు. తన తోటి మిత్రులు మాత్రం ఉన్నత స్థాయికి వెళ్తుంటే..తాను మాత్రం మొదటి నుంచి ఒకే స్థానంలో ఉద్యోగం చేస్తున్నానని ఆలోచిస్తూ..మానసిక క్షోభకు గురి అయ్యాడు. సైదులు ప్రమోషన్ లేకుండా ఉండటంతో భార్య నిర్మల చిరాకుగా ఇద్దరు పిల్లల్ని తీసుకొని స్థానికంగా ఉన్న స్కూల్లో దించడానికి వెళ్ళారు. నిర్మల వెళ్లాక సుమారు ఏడున్నర గంటల ప్రాంతంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని సైదులు ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Next Story
Share it