టీమిండియా ప్రస్తుతం న్యూజిలాండ్‌తో తొలి టెస్టు మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ వేసే సమయంలో.. కోహ్లీ మైదానంలో ఒక విచిత్రమైన స్టెప్‌ వేశాడు. బ్లేజర్ ధరించిన కోహ్లీ.. తన రెండు చేతులను చాచి డాన్స్‌ చేస్తున్నట్లు కనిపిస్తున్న ఫోటోను బీసీసీఐ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఆ ఫోటోకు మంచి వ్యాఖ్యను జోడించమని అభిమానులను కోరింది. ఉత్తమ కామెంట్లను అక్కడ పేర్కొంటామని చెప్పంది.

టీమిండియా మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ స్పందించాడు. తనదైన శైలిలో ఫన్నీ కామెంట్‌ చేశాడు. కోహ్లీ వేళ్లు విరిగిపోయాయని తన కామెంట్‌లో పేర్కొన్నాడు. ఎందుకంటే ఆ ఫోటోలో కోహ్లీ రెండు చేతులు చాచినట్లు కనిపిస్తుండగా.. వేళ్లు మాత్రం కిందకు వేలాడుతున్నట్లు ఉన్నాయి. దీంతో శ్రేయాస్ అయ్యర్ అలా స్పందించాడు. ఇటీవల టీమిండియా ఎదుర్కొన్న ఓ సమస్యకు పరిష్కారంగా అయ్యర్‌ కనిపిస్తున్నాడు. నాలుగో నెంబర్‌ స్థానంలో నిలకడగా ఆడుతూ.. జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా దూసుకెలుతున్నాడు. ప్రపంచ కప్‌ సెమీస్‌లో టీమిండియా ఓటమికి మిడిల్‌ ఆర్డర్‌ వైఫల్యమే కారణం.

Newsmeter.Network

Next Story