యుట్యూబ్ లో దుమ్మురేపుతున్న షిరీన్ సంజయ్

By సుభాష్
Published on : 1 March 2020 6:19 PM IST

యుట్యూబ్ లో దుమ్మురేపుతున్న షిరీన్ సంజయ్

దుబాయ్ లో నివసిస్తున్న భారత టీనేజీ అమ్మాయి యుట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటి వరకూ ఆమె 51 కవర్ సాంగ్స్ ను, రెండు ఒరిజినల్ కంపొజిషన్స్ ను తన యుట్యూబ్ ఛానల్ లో విడుదల చేసింది. మిలియన్ వ్యూస్ ను ఆమె ఎంతో ఈజీగా సాధించింది.

15 సంవత్సరాల షిరీన్ సంజయ్ తన మొదటి ఒరిజినల్ సాంగ్ అయిన 'చల్తే చల్తే' ను ఆరు నెలల కిందట విడుదల చేసింది. ఇప్పుడు ఆ సాంగ్ కాస్తా ఒక మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. నవంబర్ 5, 2017 న షిరీన్ తన యుట్యూబ్ ఛానల్ ను మొదలుపెట్టింది. ఇప్పటి దాకా ఆమె పెట్టిన వీడియోలకు మూడు మిలియన్లకు పైగా వ్యూస్ దక్కాయి. ఇప్పటి వరకూ ఆమె 51 కవర్ సాంగ్స్ ను, రెండు ఒరిజినల్ కంపొజిషన్స్ ను ఆమె తన ఛానల్ లో పెట్టింది.

దుబాయ్ లోని ఢిల్లీ ప్రైవేట్ స్కూల్ లో గ్రేడ్ 11 చదువుతోంది షిరీన్ సంజయ్. ఇంగ్లీష్, హిందీల లోనే కాకుండా తన మాతృభాష పంజాబీలో కూడా ఆమె పాటలు పాడుతోంది. చిన్నప్పుడు రెండు విషయాల్లో తాను తన తల్లిని ఎక్కువగా కావాలని అడిగానని ఒకటి 'ఫుడ్'.. ఇంకోటి 'మ్యూజిక్' అని చెప్పింది షిరీన్. ఆ తర్వాత పెద్దగవుతున్న కొద్దీ సంగీతం అంటే అమితమైన ఇష్టం మొదలైందని గల్ఫ్ న్యూస్ కు ఆమె ఇచ్చిన ఇంటర్ వ్యూలో చెప్పుకొచ్చింది. దుబాయ్ లోని 'గురు నానక్ దర్బార్ గురుద్వార' లో మొదటిసారి ఆమె తన స్టేజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఆమె వాయిస్ విన్న చాలా మంది ఆమెను ప్రశంసల్లో ముంచేశారు. తన కుటుంబం ముందు నుండి ప్రోత్సహించడం వలనే సంగీతం నేర్చుకున్నానని.. అమ్మమ్మ నన్ను ఎక్కువగా ఎంకరేజ్ చేసిందని చెప్పుకొచ్చింది షిరీన్. తాను ప్లే బ్యాక్ సింగర్ కావాలని అనుకుంటూ ఉన్నానని.. మరిన్ని స్టేజ్ షోలు ఇవ్వాలని తాను అనుకుంటున్నానని చెప్పుకొచ్చింది షిరీన్. ఏ.ఆర్.రెహ్మాన్, బేయాన్స్ అంటే చాలా ఇష్టమని చెబుతోంది షిరీన్. మోనిక్ హెబ్రార్డ్ దగ్గర షిరీన్ సంగీతంలో సాధన చేస్తోంది. నా వెస్ట్రన్ సింగింగ్ స్కిల్స్, వాయిస్ మాడ్యులేషన్స్ విషయంలో పట్టు సాధించడానికి మోనిక్ హెబ్రార్డ్ కారణమని చెబుతోంది. తన అమ్మమ్మ యుట్యూబ్ లో వీడియోలు పెట్టేలా ప్రోత్సహించిందని చెబుతోంది షిరీన్.

Next Story