పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదీ మరోసారి తండ్రి అయ్యాడు. అతని భార్య నదియా తాజాగా ఓ పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చింది. ఇప్పటికే ఈ దంపతులకి నలుగురు కుమార్తెలు ఉండగా.. ఐదో పాప తమ ఫ్యామిలీలోకి అడుగిడినట్లు.. అప్రిదీ సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

ఇక అఫ్రిదీ.. ఐదో సారి తండ్రి అవటం పై సోషల్ మీడియా వేదికగా పలువురు సెటైర్లు వేస్తున్నారు. అఫ్రిదీ క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్ అయ్యి.. ప్రస్తుతం క్రికెట్‌ టీమ్‌ను తయారు చేసే పనిలో ఉన్నాడు అని ఓ నెటీజన్‌ కామెంట్ చేయగా.. ఇలానే కొనసాగితే.. రాబోవు రోజుల్లో నీ భార్య, నీ కూతురు (ఆమెకి పెళ్లి అయ్యి) ఒకేసారి ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరుతారంటూ కొందరు చరుకలు వేశారు. మరికొందరు మాత్రం అఫ్రిదికి అభినందనలు తెలిపారు.

ఇదిలా ఉంటే.. అఫ్రిది తన పిల్లల పెంపకం విషయంలో ఆంక్షలు పెడుతూ విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆడపిల్లలు క్రికెట్ లేదా అవుట్‌డోర్ గేమ్స్ ఆడటం తమ సంప్రదాయాలకి విరుద్ధమని.. తన పిల్లల్ని ఆ గేమ్స్ ఆడేందుకు అనుమతించట్లేదని ఇటీవల చెప్పడంతో.. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్