దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఇంట విషాదం

By సుభాష్  Published on  1 Aug 2020 6:08 AM GMT
దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఇంట విషాదం

ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఇంటి విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి కమ్ముల శేషయ్య (89) శనివారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ రోజు సాయంత్రం బన్సీలాల్ పేట స్మశానవాటికలో శేఖర్‌ కమ్ముల తండ్రి అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు శేఖర్‌ను పరామర్శించారు.

ఇక శేఖర్‌ కమ్ముల నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్‌లో 'లవ్‌స్టోరీ' సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ తుది దశకు చేరుకుంది.

Next Story