పండగ ఎఫెక్ట్ : కిటకిటలాడుతున్న రైల్వే స్టేషన్లు

By Newsmeter.Network  Published on  6 Oct 2019 2:57 PM GMT
పండగ ఎఫెక్ట్ : కిటకిటలాడుతున్న రైల్వే స్టేషన్లు

సికింద్రాబాద్ : దసరా రెండు రోజులు ఉందనగానే..సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు పండగ కళ వచ్చేసింది. పండగను ఇంటి దగ్గర ఆనందంగా జరుపుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇంటిబాట పట్టారు. దీంతో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ఏపీకి బస్సులు తిరుగుతున్నప్పటికీ..తెలంగాణలో సమ్మె కొనసాగుతుండటంతో ఈ రాష్ట్రం వారు రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో రద్దీ చాలా ఎక్కువుగా పెరిగింది. రెండ్రోజుల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ నుంచి 1.80లక్షల మంది రాకపోకలు సాగించారు. రద్దీ దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు రైల్వే అధికారులు.

ఒక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషనే కాదు మిగిలిన రైల్వే స్టేషన్లు కూడా కిటకిటలాడుతున్నాయి. పండగ మంగళవారమే కావడంతో ప్రయాణికుల రద్దీ మరింత పెరిగే అవకాశముంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు.

Next Story
Share it