రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి బాంబు పేల్చివేత

By సుభాష్  Published on  15 Oct 2020 6:49 AM GMT
రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి బాంబు పేల్చివేత

రెండో ప్రపంచ యుద్దానికి చెందిన భారీ బాంబు నీటిలో పేలాయి. దీనిని పోలాండ్‌లో గుర్తించిన నేవీ అధికారులు, స్వినోజ్‌సై ప్రాంతంలోని పియాస్ట్‌ కాలువలోకి తీసుకెళ్లి నిర్వీర్యం చేస్తుండగా, అది పేలిపోయింది. దీనిని నిర్వీర్యం చేసే సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న 750 మందిని అక్కడి నుంచి తరలించారు.2,400 కిలోల పేలుడు పదార్థంతో సహా ఈ బాంబు బరువు 5,400 కిలోలు ఉందని అధికారులు వెల్లడించారు.

అయితే నిర్వీర్యం కాస్త పేలుడుగా మారింది. దీంతో ఇకపై ఎలాంటి ముప్పు ఉండదు అని అక్కడి అధికారి వెల్లడించారు. డేంజర్‌ జోన్‌కు దూరంగా మైన్‌డైవర్‌ ఉండి దీనిని నిర్వీర్యం చేసినట్లు ఆయన తెలిపారు. అ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తినష్టం కానీ జరగలేదు. రెండో ప్రపంచ యుద్దం జరిగే సమయంలో 1945లో జర్మన్‌ క్రూయిజర్‌ లుట్జోపై బ్రిటన్‌ రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఈ బాంబులను వేసింది. స్వినోజ్‌సై ప్రాంతంలోని ఓడరేవు దగ్గర భూమిలో 12 మీటర్ల లోతులో పాతకుపోయిన ఐదు టన్నులు బరువున్న బాంబును గత ఏడాది అధికారులు గుర్తించారు. మంగళవారం ఈ బాంబును బాల్టిక్‌సీ సముద్రంలో ముంచి పేలుడు సంభవించకుండా నిర్వీర్యం చ ఏయాలని పోలాండ్‌ నేవీ అధికారులు ప్రయత్నించినా.. చివరి నిమిషంలో పేలింది.

అయితే ఈ బాంబు నిర్వీర్యం చేసే ప్రాంతానికి 500 మీటర్ల దూరంలో ఓ బ్రిడ్జి ఉండటంతో దానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా పోలాండ్‌ దేశ నౌకాదళం జాగ్రత్తలు తీసుకుంది. డీప్లాగరేషన్‌ పద్దతితో రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా బాంబును నిర్వీర్యం చేయాలని భావించారు. ఈ ప్రక్రియ దశలో ఒక్కసారిగా పేలినట్లు అధికారులు చెప్పారు.

Next Story