మీకు ఎస్‌బీఐ బ్యాంకు నుంచి తరచూ టెక్ట్స్‌మెసేజ్‌లు, ఈమెయిల్స్‌ వస్తున్నాయా.. అయితే అప్రమత్తం కండి. ఎందుకంటే..ఫిబ్రవరి 28 నుంచి ఆ ఖాతాలు నిలిపివేయనున్నారు. తగిన కేవైసీ(నో యువర్‌ కస్టమర్‌) పత్రాలు సమర్పించని వారి ఖాతాలు నిలిపివేయనున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. అసంపూర్తి కేవైసీ పత్రాలను అందించిన వారు తక్షణమే తగిన పత్రాలతో సంప్రదించాలని, భవిష్యత్‌లో బ్యాంకింగ్‌ లావాదేవీల్లో అసౌకర్యాన్ని నివారించాలని ఎస్‌బీఐ తన ఖాతాదారులకు జారీ చేసిన బహిరంగ నోటీసులో పేర్కొంది. కేవైసీ అసంపూర్తిగా ఉన్న ఖాతాదారులను అప్రమత్తం చేస్తూ ఎస్‌బీఐ తరచూ టెక్స్ట్‌ మెసేజ్‌లు, ఈమెయిల్స్‌ పంపుతోంది. వారు సమీపంలోని బ్రాంచ్‌కు వెళ్లి తమ కేవైసీ పత్రాలు సమర్పించి అప్‌డేట్ చేసుకోవచ్చు.

క్రింది వాటిలో ఏదైనా..

ఓటర్‌ ఐడీ,

పాస్‌పోర్ట్‌,

డ్రైవింగ్‌ లైసెన్స్‌,

టెలిఫోన్‌ బిల్లు,

పెన్షన్‌ పేఆర్డర్‌,

విద్యుత్‌ బిల్లు,

ఫోటోతో కూడిన బ్యాంక్‌ పాస్‌బుక్‌,

ఆధార్‌ కార్డు,

పాన్‌ కార్డులను

వీటిలో ఏదైన వాటిని మీ సమీప బ్రాంచ్‌లో సమర్పించాల్సి ఉంటుంది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా బ్యాంకులు ఈ దిశగా కస్టమర్లను అప్రమత్తం చేస్తున్నాయి.

Newsmeter.Network

Next Story